సీఎం జగన్‌తో ఏపీ నూతన డీజీపీ భేటీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కొత్తగా ఎన్నికైన డీజీపీ గౌతమ్ సవాంగ్ అమరావతిలో కలిశారు. గౌతమ్ సవాంగ్‌ను ఏపీ డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశాక ఆయన సీఎంతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంతో పాటు ఐపీఎస్ అధికారుల బదిలీలపై డీజీపీతో సీఎం చర్చించినట్లు సమాచారం. కాగా ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కొత్తగా ఎన్నికైన డీజీపీ గౌతమ్ సవాంగ్ అమరావతిలో కలిశారు. గౌతమ్ సవాంగ్‌ను ఏపీ డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశాక ఆయన సీఎంతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంతో పాటు ఐపీఎస్ అధికారుల బదిలీలపై డీజీపీతో సీఎం చర్చించినట్లు సమాచారం. కాగా ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.