Janasena Chaitanya Ratham: కనీసం ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా? వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్..

ఎన్నికల యుద్ధానికి సిద్ధం అనే ట్యాగ్‌తో జనసేన సిద్ధం చేసిన పవన్‌కల్యాణ్ చైతన్యరథం ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ చైతన్య రథానికి వేసిన రంగే దీనింతటికీ కారణం.

Janasena Chaitanya Ratham: కనీసం ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా? వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్..
Pawan Kalyan

Updated on: Dec 09, 2022 | 8:11 AM

ఎన్నికల యుద్ధానికి సిద్ధం అనే ట్యాగ్‌తో జనసేన సిద్ధం చేసిన పవన్‌కల్యాణ్ చైతన్యరథం ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ చైతన్య రథానికి వేసిన రంగే దీనింతటికీ కారణం. వాహనానికి వేసిన ఆలీవ్ గ్రీన్ కలర్‌పై వైసీపీ నేతల నుంచి సెటైర్లు పేలుతుండగా.. దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్. కనీసం ఈ ఆలీవ్ కలర్ షర్ట్ అయినా వేసుకోవచ్చా? అంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ‘మొదట మీరు నా సినిమాలను అడ్డుకున్నారు. ఆ తరువాత విశాఖపట్నం పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా నా కారును అడ్డగించారు.  కనీసం నడిచి వెళ్దామంటే నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది. తర్వాత నన్ను ఊపిరి కూడా తీసుకోవద్దంటారా చెప్పండి ఏం చేయాలో’ అంటూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.

అంతకుముందు.. ‘వారాహి’కి వేసిన రంగుపై వైసీపీ ముఖ్య నేతలు సైటర్లు వేశారు. ఆలీవ్ గ్రీన్ కంటే.. పసుపు రంగు వేసుకుంటే మంచిది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మిలిటరీ తప్పితే మరే ప్రయివేటు వ్యక్తులూ తమ వెహికల్స్‌కి అలీవ్ గ్రీన్ కలర్ వాడటం నిషిద్ధం అని, అలాంటిది జనసేన వాహనానికి ఆ రంగు వేస్తే ఎలా అనుమతి వస్తుందన్నారు. జనసేన బండి.. తెలంగాణలో కూడా నడవదని, అందుకే ఆ వాహనానికి పసుపు రంగు వేసుకుంటే బెటర్ అని సెటైర్లు వేశారు పేర్నినాని. పేర్ని చేసిన ఈ కామెంట్స్‌కే పవన్ పై విధంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..