Hayagriva Land Issues: హాయగ్రీవ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు మునిసిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్టు వచ్చిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఆదివారం నాడు విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. హయగ్రీవ భూముల విషయంలో జరుగుతున్న వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. 2019 లో ఎంవివి సత్యనారాయణ హాయగ్రీవ కు రూ.15 కోట్లు అప్పుగా ఇచ్చిన సమయానికి ఆయన ఎంపీ కూడా కాదన్నారు మంత్రి బొత్స. ఆ సమయానికి తమ ప్రభుత్వం అధికారంలో కూడా లేదన్నారు. హాయగ్రీవ వివాదంలో తానేదో ప్రత్యేక సమావేశాలు పెట్టినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు.
జీవీఎంసీ ప్రవేశపెట్టబోయే ఒక కార్యక్రమాన్ని చర్చించేందుకు కమిషనర్, స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ తో చర్చిస్తే దానిపై తప్పుడు కథనాలు సృష్టించారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో కాపుల సమావేశంపైనా ఆయన స్పందించారు. హైదరాబాద్‌లో జరిగింది కాపుల కీలక సమావేశం కాదని అన్నారు. కడుపుమంట ఉన్న వాళ్ళు సమావేశం పెట్టుకున్నంత మాత్రాన దానిని అంతగా పట్టించుకోనవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక జిన్నా టవర్స్ వివాదంపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. జిన్నా టవర్స్, కేజీహెచ్ పేరు మార్పు లాంటివి చీప్ ట్రిక్స్ అని కొట్టిపారేశారు. బీజేపీ కి వేరే అజెండా లేకనే వీటిపై రాజకీయం చేస్తున్నారన్నారు మంత్రి బొత్స.
Also read:
Omicron: హోమ్ టెస్ట్ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..