AP News: అరె ఇదేం మిస్టరీ.. తెల్లారేసరికి నడిపొలంలో ఇలా…

పెద్ద బావిలా వృత్తాకారంలో సాగు భూమి కుంగిపోవడంతో రైతు ఆందోళనకు గురయ్యాడు. 2019లోనూ అక్కడ భూమి ఇలానే కుంగిందట. అప్పట్లో దాన్ని పూడ్చేందుకు రూ.50 వేలు వెచ్చించినట్లు అతను చెబుతున్నాడు.

AP News: అరె ఇదేం మిస్టరీ.. తెల్లారేసరికి నడిపొలంలో ఇలా...
Land Sunk
Follow us

|

Updated on: Sep 05, 2024 | 6:55 PM

ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నట్టుండి భూమి కుంగిపోవ‌డం మిస్టరీగా మారింది. జిల్లా ప‌రిధిలోని దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో రైతు మానుకొండు శివ‌కి చెందిన వ్యవ‌సాయ భూమిలో బుధవారం నాడు సుమారు 6 అడుగుల లోతు భూమి కుంగిపోయి, పెద్ద బావిలా ఏర్పడింది. అస‌లేమైందో, ఎందుకు భూమి ఇలా కుంగిపోయిందో అంతుపట్టడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2019లోనూ ఇలాగే జ‌రిగింద‌ని రైతు భార్య చెప్పారు. ఇదే భూమి అప్పట్లో కూడా ఇలాగే కుంగిందని తెలిపారు. దాంతో దాన్ని పూడ్చేందుకు రూ.50 వేలు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చిందని తెలిపారు. అసలు ఇలా భూమి ఉన్నట్టుండి ఎందుకు కుంగిపోతుందో వ్యవ‌సాయ‌ అధికారులు ఒక‌సారి వ‌చ్చి పరిశీలిస్తే బాగుంటుంద‌ని రైతు కోరుతున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పంట వేయలేదని లేదంటే పెద్ద నష్టమే జరిగేదని వాపోయారు. భూమి కుంగిన సమయంలో పొలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైతు శివ భార్య చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా అధికారులు తమ ఆవేదన అర్ధం చేసుకొని ఇక్కడ పరిశోధనలు జరిపించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.