AP BJP: పవన్‌- చంద్రబాబు భేటీతో బీజేపీ అలర్ట్‌.. హైకమాండ్‌కు సోము రిపోర్ట్.. ఏపీలో పొలిటికల్ హీట్..

|

Oct 19, 2022 | 10:09 AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పలు విషయాలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఢిల్లీ పెద్దలకు సమగ్ర నివేదిక అందించారు.

AP BJP: పవన్‌- చంద్రబాబు భేటీతో బీజేపీ అలర్ట్‌.. హైకమాండ్‌కు సోము రిపోర్ట్.. ఏపీలో పొలిటికల్ హీట్..
Follow us on

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విశాఖ నుంచి మొదలైన పొలిటికల్ హీట్.. అనేక నాటకీయ పరిస్థితుల మధ్య అమరావతి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయ చర్చనీయానీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పలు విషయాలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఢిల్లీ పెద్దలకు సమగ్ర నివేదిక అందించారు. విశాఖపట్నం ఘటన, నోవాటెల్ హోటల్‌లో సోము వీర్రాజు, పవన్ మధ్య జరిగిన చర్చ.. ఆ తర్వాత ఏపీలో నెలకొన్న పరిస్థితులు, పవన్ – చంద్రబాబు భేటీ తదితర అంశాలపై సోము బీజేపీ అగ్రనేతలకు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ మీడియాకి తెలీకుండా గోప్యత పాటించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోము వీర్రాజు బెంగుళూరులో ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఢిల్లీకి వెళ్ళిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆ తర్వాత బెంగళూరు చేరుకున్నట్లు నాయకులు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన బీజేపీ అధిష్టానానికి పూర్తి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ రోజు సాయంత్రం విజయవాడకు చేరుకొని సోము వీర్రాజు బీజేపీ నేతలతో అత్యవసర సమావేశం కానున్నారు.

విశాఖ ఘటన అనంతరం సోము వీర్రాజు.. పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఈ ఎపిసోడ్‌లోకి చంద్రబాబు ఎంట్రీతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలో నిన్న పవన్‌- చంద్రబాబు భేటీతో అలర్ట్‌ అయిన బీజేపీ.. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లింది. విశాఖ ఘటన, పవన్‌-చంద్రబాబు భేటీపై పూర్తి రిపోర్టును అందజేసింది. అయితే.. ఏపీలో రోడ్‌మ్యాప్‌ విషయంలో బీజేపీ తీరుపై పవన్ అసంతృప్తితో ఉన్నారు.. ఈ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశమైంది. వ్యూహం మార్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యల ఆంతర్యమేంటి..? అనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్నగా మారింది. అయితే నిన్న బీజేపీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ సంకేతాలు పంపారు. బీజేపీతో పొత్తు ఉంది. కలిసి నడవాలని ఉంది. కానీ క్లారిటీ లేదు అని పవన్ కామెంట్స్‌ చేశారు. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్‌తో మాటల్లో వేరియేషన్‌ కనిపించడంతో బీజేపీ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ.. పవన్‌ ఇప్పటికీ మిత్రపక్షమే అంటూ ఏపీ బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. సోము వీర్రాజు నివేదిక అనంతరం హైకమాండ్ సూచనలతో.. ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ పవన్ – బీజేపీతో కలిసి రాకపోతే.. పార్టీ ఎలా ముందుకు వెళ్లాలి.. అదేవిధంగా తాజా పరిణామాలు, పలు అంశాలపై నేడు జరిగే అత్యవసర భేటీలో ఏపీ బీజేపీ నేతలతో సోము చర్చించే అవకాశముందని సమాచారం..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..