Andhrapradesh: రండి బాబు రండి.. కోతులను పట్టుకోండి.. ఒకొక్క కోతికి రూ.500 నగదు తీసుకోండి.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే
రోజు రోజుకు కోతుల సంఖ్య పెరుగుతూ, ఇండ్ల మీద వీర విహారం చేస్తూ కోతుల గోల బెంబేలెత్తిస్తోందంటున్నారు బాధిత గ్రామస్తులు. ఇంటిలో ఉన్న ఆహారాన్ని ఎత్తుకుపోతున్నాయని.. అంతేకాదు.. తమ మీద తిరగబడి కురుస్తున్నాయి.
కోతులను పట్టు కుంటే బంపర్ ఆఫర్…గ్రామంలో కోతుల బెడద తట్టుకోలేక ఆ గ్రామ పెద్దలు ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో కోతులను పట్టుకుని దూరంగా విడిచి పెడితే చాలు. ఒక్కొక్క కోతికి 500 రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు కాకినాడ రూరల్ గ్రామ సర్పంచ్.
కాకినాడ రూరల్ పరిధిలో 10 గ్రామాల్లో కోతుల వలన రైతులు, ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. రోజు రోజుకు కోతుల సంఖ్య పెరుగుతూ, ఇండ్ల మీద వీర విహారం చేస్తూ కోతుల గోల బెంబేలెత్తిస్తోందంటున్నారు బాధిత గ్రామస్తులు. ఇంటిలో ఉన్న ఆహారాన్ని ఎత్తుకుపోతున్నాయని.. అంతేకాదు.. తమ మీద తిరగబడి కురుస్తున్నాయి.. పిల్లలు బయటకు వెళ్ళితే.. మీద దాడికి పాల్పడుతున్నాయని .. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని ప్రజల ఫిర్యాదుతో గ్రామ సర్పంచ్‌లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..