ఏపీలో రెండోరోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు
ఏపీలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు మున్సిపల్ కార్పొరేషన్లలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారుల సోదాలు జరుపుతున్నారు. 14 చోట్ల, 100 మంది ఏసీబీ అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో..

ఏపీలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు మున్సిపల్ కార్పొరేషన్లలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారుల సోదాలు జరుపుతున్నారు. 14 చోట్ల, 100 మంది ఏసీబీ అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో రెండో రోజు ఏసీబీ సోదాల నిర్వహణ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిని గుర్తించారు అధికారులు. అనాధరైజెడ్ బిల్డింగ్‌కు పర్మిషన్లు ఇస్తూ క్యాష్ చేసుకుంటున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇవాళ్ల అన్ని టౌన్ ప్లానింగ్ విభాగాల్లో రికార్డుల పనితీరును పరిశీలించారు అధికారులు. ఇప్పటికే ఏపీలోని 14 మున్సిపల్ కార్పొరేషన్లలో అన్అకౌంటెడ్ అమౌంట్ 2.87 లక్షలను సీజ్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు, కృష్ణా జిల్లాలో తనిఖీలు చేసి, అత్యంత గోప్యంగా విచారణ చేస్తారు ఏసీబీ అధికారులు.
కాగా.. రికార్డ్స్ మెయింటెన్స్‌లో లోపాలు, సిటిజన్ చార్ట్‌లో నిర్లక్ష్యాలు, అనుమతి లేని భవనాలకు అప్రూవల్స్‌తో పాటు డెస్క్‌లలో, ఫైల్స్‌లో అనధికారిక నగదును గుర్తించారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా మునిసిపల్ ఆఫీసులతో పాటు టౌన్ ప్లానింగ్ సెక్షన్‌ను అధికారుల కార్యాలయాలపై మెరుపు దాడులు చేస్తోంది. వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది ఏపీ ఏసీబీ.



