AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మట్టిలో మణిక్యం.. గ్రామీణ ప్రాంతంలో పుట్టి భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అమ్మాయి

మనదేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే రెప్ప వాల్చకుండా క్రికెట్ మ్యాచ్‌లు చూడటంలో మునిగిపోతారు క్రికెట్ అభిమానులు. అయితే ఎవరైన క్రికెటర్ కావాలనుకుంటే మాత్రం ఆ స్థాయికి వెళ్లడం మాములు విషయం కాదు.

మట్టిలో మణిక్యం.. గ్రామీణ ప్రాంతంలో పుట్టి భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అమ్మాయి
Team
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jul 05, 2023 | 11:10 AM

Share

మనదేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే రెప్ప వాల్చకుండా క్రికెట్ మ్యాచ్‌లు చూడటంలో మునిగిపోతారు క్రికెట్ అభిమానులు. అయితే ఎవరైన క్రికెటర్ కావాలనుకుంటే మాత్రం ఆ స్థాయికి వెళ్లడం మాములు విషయం కాదు. క్రికెటర్ అవ్వాలని చాలామంది యువకులు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందులో కొందరికి మాత్రమే అవకాశాలు వస్తాయి. ఇక కొంతమంది అమ్మాయిలు కూడా భారత జట్టులో చోటు  సంపాదించుకునేందుకు శ్రమిస్తారు. కానీ ఓ క్రికెటర్ కావాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఓ క్రికెటర్ అవ్వాలంటే వారు బాగా డబ్బున్నవారై ఉండాలి. ఇలాంటి వారికే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందుకే చాలా మంది భారత జట్టుకి ఎంపిక కావడం చాలా కష్టమైన విషయం అని చెబుతారు. అయితే గ్రామీణ ప్రాంతంలో పుట్టి తాటి మట్టలతో చిన్నప్పుడు క్రికెట్ ఆడిన ఓ అమ్మాయి ఏకంగా భారత మహిళల సీనియర్ జట్టుకు ఎంపిక అయ్యింది. ఆమె పేరే అనుష. చిన్నప్పుడు తాటిమట్టలతో క్రికెట్ ఆడిన ఈ అమ్మాయి నేడు అంతర్జాతీయ క్రికెటర్‌గా అరంగేట్రం చేసింది.

No description available.

ఇవి కూడా చదవండి

వివరాల్లోకి వెళ్తే అనుష స్వస్థలం అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామం. ఈమె తల్లిదండ్రులు మల్లిరెడ్డి, లక్ష్మీదేవి. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనుషకు చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది.

మారుమూల గ్రామంలో పుట్టిన ఈమెకు సరైన వసతులు లేనప్పటికీ కూడా తన తల్లిదండ్రులు కోచ్‌ల సహాయంతో క్రికెట్ నేర్చుకుంది. అనంతపురం ఆర్డీటీలో క్రికెట్ శిక్షణ తీసుకుంది పట్టుదలతో కృషి చేసి జిల్లాస్థాయి క్రికెట్‌లో తన సత్తా చాటింది. స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరిపిస్తూ సెలక్టర్ల దృష్టిలో పడింది.

చివరికి భారత మహిళల సీనియర్ జట్టుకు ఎంపిక అయ్యింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్ కు అనంతపురం రైతు బిడ్డ ఎంపిక కావడం పట్ల ఆమె తల్లిదండ్రులు, జిల్లా వాసులు‌, క్రికెట్ కోచ్‎లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2019లో వచ్చిన “కౌసల్యకృష్ణమూర్తి” సినిమాలో.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గ్రామీణ ప్రాంతం నుంచి క్రికెటర్ అయినట్లు.. అనూష కూడా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడేందుకు ఎంపిక కావడం చాలా గొప్ప విషయం. జులై 9న బంగ్లాదేశ్‎తో జరిగే 3వన్డేలు, 3 టీ20 మ్యాచ్‎లలో ఆడనుంది అనూష. ఇక జులై 6న మహిళా జట్టుతో కలిసి ఆమె బంగ్లాదేశ్‌కు పయనం కానుంది.

(రిపోర్టర్: నరేష్, అనంతపురం)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్