Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాల ప్యాకెట్‌ను పైనుంచి లాగుతున్నారా.. బీ కేర్ ఫుల్..! విశాఖలో ఏం జరిగిందో తెలుసా..?

విశాఖ మురళీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో పద్మావతి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. పాల ప్యాకెట్ కోసం.. పై అంతస్తు నుంచి కిందకు డబ్బా వేశారు. ఓ వైరు సాయంతో కింద ఉన్న డబ్బాను లాగే ప్రయత్నం చేశారు పద్మావతి. ప్రమాదవశాత్తు వైరు కరెంటు తీగలకు తాకడంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురయ్యారు. అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

పాల ప్యాకెట్‌ను పైనుంచి లాగుతున్నారా.. బీ కేర్ ఫుల్..! విశాఖలో ఏం జరిగిందో తెలుసా..?
Software Engineer
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Balaraju Goud

Updated on: May 03, 2025 | 7:18 PM

విశాఖ మురళీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో పద్మావతి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. పాల ప్యాకెట్ కోసం.. పై అంతస్తు నుంచి కిందకు డబ్బా వేశారు. ఓ వైరు సాయంతో కింద ఉన్న డబ్బాను లాగే ప్రయత్నం చేశారు పద్మావతి. ప్రమాదవశాత్తు వైరు కరెంటు తీగలకు తాకడంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురయ్యారు. అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించేసరికి అప్పటికే ప్రాణాలకు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు. తొలుత ఏం జరిగిందోనని ఆందోళన చెందిన ఆ కుటుంబం, పోలీసులు.. సీసీ కెమెరాలు వెరిఫై చేశాక అసలు విషయం తెలిసింది. దీంతో ఈ ఘటను సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న వెంకట పద్మావతికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అనుకోని దుర్ఘటనతో ఆ కుటుంబం విషాదంలోకి వెళ్ళింది. విశాఖ మురళీనగర్‌లోని అయ్యప్పనగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అయ్యప్పనగర్‌లో నివాసముంటున్న వెంకట పద్మావతి.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిసస్తున్నారు. భర్త అజయ్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఇల్లు రెండో అంతస్తులో ఉంది. దీంతో.. కింద నుంచి పాలు, ఇతర సామగ్రిని తీసుకునేందుకు ఇంటి ముందు వైరుకు ఓ డబ్బాను కట్టి ఏర్పాటు చేసుకున్నారు.

అయితే రోజులాగే పాల ప్యాకెట్ అందుకునే క్రమంలో పద్మావతి ప్రాణాలు కోల్పోయింది. ఈదురుగాలులకు ఆ వైరు కరెంటు తీగలకు తాకింది. దీన్ని గమనించని పద్మావతి రోజులాగే ఉదయం పాల ప్యాకెట్ల కోసం డబ్బాకు ఉన్న తీగను లాగేందుకు పట్టుకున్నారు. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయారు. ఆసుపత్రికి తరలించే లోగానే ఆమె ప్రాణాల కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..