Andhra News: ప్రాణంగా పెంచుకున్న కుక్క మృతి.. ప్రతి ఏడాది దాన్ని జ్ఞాపకాల్లో ఇలా..

పద్నాలుగేళ్ల క్రితం డాబర్ మెన్ కుక్క పిల్లను కొని ఓ వ్యక్తి ఇంటికి తెచ్చుకున్నాడు. గత ఏడాది ఇంటి బయట వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో కుక్క ప్రాణాలు కోల్పోయింది. డిసెంబర్ 17కి ఆ కుక్క చనిపోయి ఏడాది అయిన సందర్భంగా ప్లెక్స్ కూడా వేయించి ఇంటి ముందు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Andhra News: ప్రాణంగా పెంచుకున్న కుక్క మృతి.. ప్రతి ఏడాది దాన్ని జ్ఞాపకాల్లో ఇలా..
Dog Funeral Flexi
Follow us
T Nagaraju

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 18, 2024 | 2:01 PM

దాని పేరు జిమ్మి.. పద్నాలుగేళ్ల క్రితం ఆ ఇంటిలోకి అడుగుపెట్టింది. ఎంతో అపురూపంగా దాన్ని చూసుకున్నారు. ప్రేమానురాగాలు కురిపించే అది క్యాన్సర్ బారిన పడితే అత్యాధునిక వైద్యం కూడా చేయించారు. అయినా విధి రాత మరోలా ఉంది. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో అది చనిపోయింది. అంతే ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఏడాది గడిచిన దాని జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో వర్ధంతికి ప్లెక్స్ వేసి మరోసారి దాని పట్ల వారి అభిమానాన్ని చాటుకున్నారు.

గుంటూరు ఫాతిమా పురంకు చెందిన సీతంశెట్టి శ్రీనివాసరావు.. పద్నాలుగేళ్ల క్రితం డాబర్ మెన్ కుక్క పిల్లను కొని ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటి నుండి దాన్ని అపురూపంగా పెంచుకున్నారు. దానికి జిమ్మి అని పేరు కూడా పెట్టుకున్నారు. కొన్నేళ్ల తర్వాత జిమ్మికి క్యాన్సర్ సోకింది. మంచి వైద్యం చేయించడంతో క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడింది. కాని కొద్దీ కాలానికే ఇంటి బయట వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో జిమ్మి ప్రాణాలు కోల్పోయింది. జిమ్మి లేని బాధను మర్చిపోవటానికి మరో కుక్క పిల్లను తెచ్చుకొని శ్రీనివాసరావు పెంచుకుంటున్నారు.

ఏడాది క్రితం డిసెంబర్ 17వ తేదీనే జిమ్మి ప్రాణాలు కోల్పోయింది. జిమ్మి చనిపోయి ఏడాదైనా సందర్భంగా శ్రీనివాసరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అంతేకాదు జిమ్మి గుర్తుగా ప్లెక్స్ కూడా వేయించి ఇంటి ముందు పెట్టుకున్నారు. శ్రీనివాసరావు కుటుంబం జిమ్మి పట్ల చూపించిన ప్రేమను తలుచుకొని కాలనీ వాసులు కూడా మరోసారి జిమ్మిని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి