Andhra Pradesh: దేవుడి మెడలో పార్టీ కండువా… పూజారి అత్యుత్సాహంతో నివ్వెరపోయిన భక్తులు

కండువాలు ఒక హుందాతనానికి సింబల్. పూర్వం ఎవరి భుజంపై చూసినా తెలుగు రాష్ట్రాల్లో కండువా కనిపించేది. ఇప్పటికి పంచె కడితే కండువాను ధరించటం ఆనవాయితీ. అయితే ఇపుడు రాజకీయ కండువాలు పిచ్చి ఫేమస్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఒక ఆలయంలో పూజారి ప్రవర్తించిన తీరు అందరిని షాక్‌కు గురి చేసింది.

Andhra Pradesh: దేవుడి మెడలో పార్టీ కండువా... పూజారి అత్యుత్సాహంతో నివ్వెరపోయిన భక్తులు
Screenshot 2024 03 12 111843
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 12, 2024 | 11:46 AM

కండువాలు ఒక హుందాతనానికి సింబల్. పూర్వం ఎవరి భుజంపై చూసినా తెలుగు రాష్ట్రాల్లో కండువా కనిపించేది. ఇప్పటికి పంచె కడితే కండువాను ధరించటం ఆనవాయితీ. అయితే ఇపుడు రాజకీయ కండువాలు పిచ్చి ఫేమస్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఒక ఆలయంలో పూజారి ప్రవర్తించిన తీరు అందరిని షాక్‌కు గురి చేసింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన కార్యకర్తలు కాటన్ క్లాత్‌లో ఎరుపు రంగు, వైట్ బోర్డర్ ఉన్న కండువాను ధరిస్తారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు పసుపు రంగు, వైసీపీ బ్లూ, వైట్ , గ్రీన్ కలిసిన రంగుల కండువాను చేసుకుంటారు. పార్టీ కార్యక్రమాల్లో ఇది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆలయాలకు వీఐపీలు వస్తే, అర్చకులు స్వామి వారి వద్ద ఉంచిన కండువాలు, శాలువాలను వారికి కల్పి ఆశీర్వదిస్తారు. భక్తులే తమ వెంట తెచ్చుకుంటే వాటిని స్వామి వారికి చూపించి తిరిగి ఎవరివి వారికి ఇస్తారు. కానీ ఈ అర్చకుడు.. కన్ఫ్యూజన్‌లో దేవుడికే వైసీపీ కండువా కప్పేశాడు.

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన జరిగింది. పొరపాటును గమనించిన ప్రజాప్రతినిధి వెంటనే దానిని సరి చేశారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది ఉద్దేశ్య పూర్వకంగా చేసిన పని కాదని సంబంధిత వ్యక్తులు వివరణ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకీ జరిగిన సంఘటన ఏంటి…? ఎందుకని ప్రతిపక్షాలు అంతగా దాని గురించి విమర్శిస్తున్నాయి..? ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరు…? దానిని ఎలా సరి చేశారు అనే విషయాలు హట్‌టాపిక్‌గా మారాయి.

మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో విఘ్నాధిపతైన వినాయకుని ఆలయంలో పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించాలనుకున్నారు. అనుకున్న విధంగానే ఆలయానికి చేరుకుని పూజలు ప్రారంభించారు. అందులో భాగంగా వైసీపీ కండువాను ఆలయ అర్చకునికి అందించారు. నిజంగా అర్చకులు భక్తులు ఏది ఇచ్చినా భగవంతుడు ముందు ఉంచి పూజలు చేస్తారు. సాధారణంగా దండలు అయితే దేవుని మెడలో వేసి అనంతరం అది ఇచ్చిన వారి మెడలో వేస్తారు. పూలు, పళ్ళు అయితే భగవంతుడు ఒళ్లో కానీ పాదాల వద్ద కానీ ఉంచి అనంతరం వారికి ప్రసాదంగా ఇస్తారు.

అయితే వైసీపీ కండువా వేసుకుంటారు కనుక దండగ భావించిన అర్చకుడు స్వామివారి మెడలో వేసి పూజలు చేయడం మొదలుపెట్టారు.. అది గమనించిన ఎమ్మెల్యే రంగనాథరాజు కండువాని మెడలో నుంచి తీసి స్వామి వారి పాదాల వద్ద పెట్టి పూజలు చేయాలని సూచించారు. పూజ అనంతరం ఆ కండువాను ఆలయ అర్చకుడు ఎమ్మెల్యే రంగనాథరాజు మెడలో వేసి ఆయనను ఆశీర్వదించారు. ఈలోపే వైసీపీ పార్టీ కండువా మెడలో వేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. రాజకీయ పార్టీకి చెందిన కండువాలు స్వామి వారి మెడలో ఎలా వేశారంటూ పలువురు ప్రశ్నించడం మొదలెట్టారు.

వీడియో చూడండి…

అయితే భక్తులు ఎవరైనా స్వామి వారికి ఏది సమర్పించిన ఆయన మెడలో కానీ, ఒడిలో కాని ఉంచి పూజలు చేయడం ఆనవాయితీ అని, అంతే తప్ప ఏ రాజకీయ పార్టీకు మద్దతు పలుకుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని అర్చకుడు వివరణ ఇవ్వటంతో వివాదం సద్ధుమణిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..