AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Matrimonial Sites: మ్యాట్రిమోనియల్ సైట్స్ లో 12 మంది మహిళలను మోసం చేసిన చేశాడు..ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ను వినియోగించేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఆ సైట్స్ లో రెండో వివాహం కోసం దరఖాస్తు చేసున్న మహిళలను లక్ష్యం చేసుకుని నకిలీ ఐడీ కార్టులు సృష్టించి ఓ వ్యక్తి చేసిన మోసం కలకలం రేపుతోంది.

Matrimonial Sites: మ్యాట్రిమోనియల్ సైట్స్ లో 12 మంది మహిళలను మోసం చేసిన చేశాడు..ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Marriage
Aravind B
|

Updated on: Apr 05, 2023 | 9:47 PM

Share

జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ను వినియోగించేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఆ సైట్స్ లో రెండో వివాహం కోసం దరఖాస్తు చేసున్న మహిళలను లక్ష్యం చేసుకుని నకిలీ ఐడీ కార్టులు సృష్టించి ఓ వ్యక్తి చేసిన మోసం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన డక్కుమళ్ల సుదర్శన రావు అలియస్ పవన్ కుమార్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. 2012లోనే అతను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అయితే అతనికి మొదటి నుండి లైంగిక కోరికలు ఎక్కువ. కోర్కెలు తీర్చుకోవటం కోసం మహిళలు కోసం వెదకటం మొదలు పెట్టాడు. అయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకోవడం సులభమని గ్రహించి అప్పటి నుండి షాదీ.కామ్ లో రిజిష్టర్ చేయించుకున్నాడు. ఆ సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకొన్న ద్వితీయ వివాహం మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన మహిళతో అదే విధంగా పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అప్పు కావాలంటూ డబ్బులు కూడా తీసుకున్నాడు. లైగింక కోరికలు తీర్చమని వేధించాడు.అయితే అనుమానం వచ్చిన ఆ మహిళ అతడ్ని నిలదీసింది. ఎక్కువగా మహిళలతో మాట్లాడుతుండటాన్ని కూడా గమనించింది. అయితే ఆమె వాట్సప్ ను వాట్సప్ వెబ్ ద్వారా స్కాన్ చేసుకొని వారిద్దరూ ఏకంతంగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలను, చాట్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో సదరు మహిళ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. దీంతో మొత్తం బండారం బయటపడింది. ఆర్మిలో మేజర్ స్తాయిలో ఉన్నట్లు నకిలి ఐడెంటీటీ కార్డులు స్రష్టించి మహిళలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అనేక మంది మహిళలతోనూ టచ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆర్మి మేజర్ స్థాయిలో ఉన్నాడని నమ్మించడానికి ఆర్మీ డిపెండెంట్ కార్డులను మహిళలకు తానే జారీ చేసేవాడు. అవన్నీ నకిలేవని పోలీసులు గుర్తించారు. దాదాపు 12 మంది అమాయక మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవడం వారిని లైంగికంగా వాడుకోవడం లాంటి పనులు చేస్తున్నాడని దిశ సిఐ నరేష్ కుమార్ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నకిలీ ఐడెంటిటి కార్డులు, డిపెండెంట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Follow Us
గుంటూరు–విజయవాడ రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్
గుంటూరు–విజయవాడ రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్
సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ ‘టర్బో 1.5’ను పరిచయం చేసిన HSW..
సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ ‘టర్బో 1.5’ను పరిచయం చేసిన HSW..
ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటి..
ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటి..
డిమార్ట్ vsరిలయన్స్ మధ్యతరగతి వారి బడ్జెట్ షాపింగ్‌కు ఏది బెస్ట్?
డిమార్ట్ vsరిలయన్స్ మధ్యతరగతి వారి బడ్జెట్ షాపింగ్‌కు ఏది బెస్ట్?
కెప్టెన్ రియాన్ పరాగ్ సొంతూరులో వైభవ్ బర్త్‌డే హంగామా
కెప్టెన్ రియాన్ పరాగ్ సొంతూరులో వైభవ్ బర్త్‌డే హంగామా
ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదా.. ఈ 3 టిప్స్ పాటిస్తే.. క్షణాల్లో
ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదా.. ఈ 3 టిప్స్ పాటిస్తే.. క్షణాల్లో
పండిన జామకాయలతో సేమియా స్వీట్ చేస్తే.. ఆ రుచిని జన్మలో మర్చిపోరు!
పండిన జామకాయలతో సేమియా స్వీట్ చేస్తే.. ఆ రుచిని జన్మలో మర్చిపోరు!
ఆది సినిమాలో ఆమె హీరోయిన్‏గా చేయాల్సింది.. కానీ..
ఆది సినిమాలో ఆమె హీరోయిన్‏గా చేయాల్సింది.. కానీ..
ఒక్క యాప్‌లో 2,400 ప్రభుత్వ సేవలు..
ఒక్క యాప్‌లో 2,400 ప్రభుత్వ సేవలు..
మందార మొక్కకు తెల్లటి పురుగు పట్టిందా? ఈ 5 చిట్కాలతో ఇజీగా మాయం!
మందార మొక్కకు తెల్లటి పురుగు పట్టిందా? ఈ 5 చిట్కాలతో ఇజీగా మాయం!