Andhra Pradesh: ఏంటీ ఈ ఘోరం.. తీసుకున్న అప్పు అడిగినందుకు ఇంత దారుణంగా హత్య చేస్తారా ?

|

May 31, 2023 | 6:40 PM

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట ప్రశాంతతకు పెట్టినా పేరు. అలాంటి ప్రాంతంలో ధాన్యం కమిషన్ వ్యాపారి హత్య జరగడం కలకలం రేపుతోంది. కేవలం 80 వేలు రూపాయిలు పాల బాకీ అడిగినందుకే 8 అడుగులు నిలువెట్టని గొయ్య తీసి కపెట్టేస్తారా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Andhra Pradesh: ఏంటీ ఈ ఘోరం.. తీసుకున్న అప్పు అడిగినందుకు ఇంత దారుణంగా హత్య చేస్తారా ?
Death
Follow us on

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట ప్రశాంతతకు పెట్టినా పేరు. అలాంటి ప్రాంతంలో ధాన్యం కమిషన్ వ్యాపారి హత్య జరగడం కలకలం రేపుతోంది. కేవలం 80 వేలు రూపాయిలు పాల బాకీ అడిగినందుకే 8 అడుగులు నిలువెట్టని గొయ్య తీసి కపెట్టేస్తారా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే మండపేటలోని శ్రీనగర్‌లో రామరెడ్డి అనే వ్యక్తి ధాన్యం కమిషన్ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఇతను రావూరి సూర్యారాయణ దగ్గర ఎప్పటినుంచో పాలు పోయించుకుంటున్నాడు. ఆ పరిచయం మీద రూ.80 వేలు అప్పు డబ్బులకి బదులు పాలు పోసేలా రామరెడ్డి దగ్గర రావూరి సత్యనారాయణ అప్పు తీసుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ధాన్యాం కమిషన్ వ్యాపారి రామరెడ్డికి సత్యనారాయణ పాలు పోయడం లేదు. తన గేదెల్ని అమ్మేశాడు. దీంతో రామరెడ్డి సత్యనారాయణ ఇంటికి వెళ్లి డబ్బుల కోసం గొడవ చేశాడు.

దీంతో పాలు అమ్ముకునే వ్యక్తి సత్యనారాయణ అవమానానికి గురయ్యాడు. అతని సోదరుడు రావూరి యేసురాజు తో కలిసి ధాన్యం కమిషన్ వ్యాపారిని హత్య చేయడానికి పథకం పన్నారు.ఈనెల 25వ తేదిన నీ డబ్బులు ఇస్తామని ధాన్యం కమిషన్ వ్యాపారి రామరెడ్డికి ఫోన్ చేసి 2వ వార్డ్ లక్ష్మి నగర్ లో ఉన్న పశువుల పాక కు రప్పించారు. అయితే ముందుగానే తీసిన 8 అడుగులు గొయ్యిలో పడేసి తలపై రాయితో కొట్టి హత్య చేశారు. చివరికి అదే పశువుల పాకలో పాతి పెట్టేశారు. ధాన్యం కమిషన్ వ్యాపారి భార్య ఫిర్యాదు మేరకు మొదట్లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన మండపేట టౌన్ పోలీసులు.. పాలమ్ముకునే వ్యక్తి మీద అనుమానం రావడంతో అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది. ఎమ్మార్వో సమక్షంలో శవాన్ని బయటికి తీయించిన పోలీసులు.. ఆ శవం ధాన్యం కమిషన్ వ్యాపారి రామరెడ్డి దేనని బంధువులు గుర్తించారు. రామరెడ్డికి చివరి సారిగా వచ్చినా ఫోన్ కాల్ ఆధారంగా నిందితులను కనిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే రామరెడ్డి తనవద్ద బాకీ తీసుకున్న సత్యనారాయణని పలుమార్లు డబ్బులు అడిగి అవమానానికి గురి చేశాడని అందుకే సత్యనారాయణ తన సోదరునితో కలిసి ఈ హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..