AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా.. పైసా కూడబెట్టి కట్టబెట్టారు.. తెల్లారేసరికల్లా కనిపించుకుండాపోయిన ఘరానా మోసగాడు..!

చీటీల పేరుతో గ్రామాల్లోని పలువురి వద్ద నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూలు చేశాడు. ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘరానా మోసగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామానికి చెందిన ఎలుబండి చక్రపాణి అనే వ్యక్తి అనేక కుటుంబాల వద్ద నుంచి చీటీల పేరుతో తమ సొమ్ము కాజేశాడంటూ బాధితులు లబోదిబోమంటున్నారు.

పైసా.. పైసా కూడబెట్టి కట్టబెట్టారు.. తెల్లారేసరికల్లా కనిపించుకుండాపోయిన ఘరానా మోసగాడు..!
Kakinada Crime News
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Oct 19, 2025 | 5:55 PM

Share

చీటీల పేరుతో గ్రామాల్లోని పలువురి వద్ద నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూలు చేశాడు. ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘరానా మోసగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామానికి చెందిన ఎలుబండి చక్రపాణి అనే వ్యక్తి అనేక కుటుంబాల వద్ద నుంచి చీటీల పేరుతో తమ సొమ్ము కాజేశాడంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. ఊరు విడిచిపెట్టి మకాం మార్చేశాడని అతని వద్ద నుంచి తమ సొమ్ము రికవరీ చేయాలని కోరుతూ పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తమ ఆర్థిక అవసరాలు తీరుతాయనే ఆశతో చక్రపాణి అనే ఆసామి వద్ద నెలవారి చీటీలు వేయగా సుమారు రెండు కోట్ల రూపాయలతో అతను పరారైనట్టు స్థానికులు తెలిపారు. తమ కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడగట్టి చీటీలు వేసుకోగా చక్రపాణి మోసంతో తామంతా అయోమయానికి గురయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్రపాణికి గ్రామంలో సొంత ఇల్లు, పొలం ఉన్నందున అతనిని రప్పించి వాటి ద్వారా తమ సొమ్మును రికవరీ చేయించాంటున్నారు. తమకు న్యాయం జరిపించాలని బాధిత ప్రజలు పోలీసులను కోరుతున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
రాజ్‌నాథ్‌తో రేవంత్ భేటీ.. తెలంగాణకు కీలక ప్రాజెక్టులపై చర్చ!
రాజ్‌నాథ్‌తో రేవంత్ భేటీ.. తెలంగాణకు కీలక ప్రాజెక్టులపై చర్చ!