AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DIY: మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సాధారణంగా మామిడి పండ్లు తిని.. వాటి తొక్కలను పనికిరావని భావించి పారేస్తుంటాం. కానీ అవే తొక్కలు చర్మ సంరక్షణ, మొక్కల సంరక్షణ, ఇంటి అవసరాలు, సహజ కీటక నివారణ వంటి అనేక ఉపయోగాలకు పనికొస్తాయి. మామిడి తొక్కలతో పొందే 5 అద్భుతమైన ప్రయోజనాలు, వాటిని సులభంగా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోండి.

DIY: మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Mango Peels DIY
Janardhan Veluru
|

Updated on: Jun 22, 2026 | 2:56 PM

Share

మామిడి పళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది మామిడి పండ్లను తిని వాటి తొక్కలను పారేస్తారు. అయితే మామిడి తొక్కలను ఆరోగ్యం, అందం, ఇంటి అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయని చాలా మందికి తెలీదు. మామిడి తొక్కలతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇకపై మామిడి తొక్కలను పారేయకుండా ఎలా వాడుకోవచ్చో తెలుసుకోండి. మామిడి తొక్కల వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చర్మ సౌందర్యం మొదలు మొక్కలకు కీటకాల నివారిణిగా వరకు మామిడి తొక్కలను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం:

మామిడి తొక్కలతో 5 అద్భుత ప్రయోజనాలు

1. సహజసిద్ధమైన ఫేస్ మాస్క్

మామిడి తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటాయి. మామిడి తొక్కలను మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా తేనె లేదా పెరుగు కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచుకుని ఆ తర్వాత ముఖం కడుక్కుంటే, నిర్జీవంగా ఉన్న చర్మం క్షణాల్లో కాంతివంతంగా, మెరుస్తూ మారుతుంది.

ఇవి కూడా చదవండి

2. చర్మం మెరవడానికి స్క్రబ్

మామిడి తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత వాటిని పొడి (పౌడర్) చేసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా రోజ్ వాటర్ లేదా పాలు కలిపి చర్మానికి రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మెల్లగా రుద్దుతూ కడిగేయాలి. ఇది చర్మంపై ఒక మృదువైన స్క్రబ్‌లా పనిచేసి, మృత కణాలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం మంచి తాజాదనంతో మెరిసిపోతుంది.

3. సహజ ఎరువుగా వాడండి

పోషకాలు ఎక్కువగా ఉండే మామిడి తొక్కలను పారేయకుండా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చు. ఎవరు తయారుచేసే బిన్‌లో దీన్ని ఉంచితే.. కొన్ని రోజులకు ఇవి బాగా కుళ్ళిపోయి, పోషకాలతో కూడిన మంచి సేంద్రీయ ఎరువుగా మారుతాయి. ఈ ఎరువును ఇంటి తోటలోని మట్టిలో కలపడం వల్ల మట్టి నాణ్యత పెరుగుతుంది. ఈ సేంద్రియ ఎరువును వాడితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

4. కుండీలలోని మొక్కలకు ద్రవ ఎరువు

మామిడి తొక్కలను ఒకటి లేదా రెండు రోజుల పాటు నీటిలో నానబెట్టంది. ఆ తర్వాత ఆ తొక్కలను బాగా పిండి నీటిని మాత్రం వేరు చేయాలి. మామిడి తొక్కల్లోని ఖనిజ లవణాలు ఈ నీటిలో బాగా కలుస్తాయి. ఈ నీటిని నేరుగా మీ కుండీలలోని మొక్కలకు పోస్తే, మొక్కలకు అవసరమైన పోషకాలు అంది అవి చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి.

5. కీటకాల బారి నుంచి రక్షణగా..

మామిడి తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి, తోటలోని మొక్కల మొదళ్లలో (మట్టిపై) వేయాలి. ఇవి మొక్కలకు హాని చేసే పురుగులు, కీటకాలు దరిచేరకుండా రక్షణగా నిలుస్తాయి. అంతేకాకుండా, కొన్ని రోజులకు ఇవి మట్టిలో కలిసిపోయి ఎరువుగా కూడా మారిపోతాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ పద్ధతిని సులభంగా ప్రయత్నించవచ్చు.

మామిడి తొక్కలను ఇలా వాడుకోవడం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు. అలాగే కెమికల్స్ లేని సహజమైన సేంద్రియ ఎరువులను ఇంట్లోనే తయారు చేసుకుని మొక్కలను కూడా కాపాడుకోవచ్చు.

Follow Us