Andhra Pradesh: విషాదం.. నాటు తుపాకీ పేలి ప్రయాణికుడి మృతి.. కోతులను వేటాడబోయి..

| Edited By: Basha Shek

Dec 12, 2023 | 9:25 PM

టు తుపాకి పేలి అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో నాటు తుపాకి పిల్లెట్ తగిలి ఘాట్ రోడ్డులో  ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి కోతులను వేటాడుతుండగా ఘటన జరిగింది. ఈనెల 5న వంట్ల మామిడి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: విషాదం.. నాటు తుపాకీ పేలి ప్రయాణికుడి మృతి.. కోతులను వేటాడబోయి..
Gun Mis Firing Incident
Follow us on

 

ఇద్దరు సహచరులు.. ఏజెన్సీలో రాడ్ బెండింగ్ వర్క్స్ చేస్తుంటారు. మిచౌంగ్ తుఫాను సమయంలో ఘాట్ రోడ్ లో జోరున వర్షం కురుస్తోంది. పని ముగించుకుని ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో ఓ మలుపు వద్ద భారీ పేలుడు శబ్దం..! బైక్ నడుపుతున్న వ్యక్తి కుప్పకూలిపోయాడు. తీరుకున్నలోపే ఇద్దరూ కింద పడిపోయారు. వెనక కూర్చున్న వ్యక్తి.. ముందు పడిపోయిన తన సహచరున్ని లేపే ప్రయత్నం చేశాడు. తల ఎడమ భాగము నుంచి రక్తం కారుతోంది. చూస్తే కంటికి లోతుగా గాయమైంది. జోరు వర్షంలో అతని ఆవేదన అంతా ఇంతా కాదు.  నాటు తుపాకి పేలి అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో నాటు తుపాకి పిల్లెట్ తగిలి ఘాట్ రోడ్డులో  ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి కోతులను వేటాడుతుండగా ఘటన జరిగింది. ఈనెల 5న వంట్ల మామిడి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుపాకి మిస్ ఫైర్ అయి.. ఘాట్ రోడ్ లో వెళ్తున్న వాహనదారుడికి పిల్లెట్ తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు.

అసలేం జరిగిందంటే..

మృతుడు విమాడుగుల మండలం వీరనారం కు చెందిన శ్రీధర్ గా గుర్తించ్చారు. ఆదిబాబు, శరగడం శ్రీదర్ రాడ్ బైండింగ్ పనులు చేస్తుంటారు. వీరు గత నెల రోజులు నుండి దుంబ్రిగుడ మండలం, కించు మండ గ్రామం లో బ్రిడ్జి వర్క్స్ రాడ్ బైండింగ్ కాంట్రాక్టు తెసుకొని చేస్తున్నారు. అయితే ఈనెల 5న ఇద్దరు పని ముగించుకొని.. ఇంటికి తిరుగు ప్రయాణమాయ్యారు. మద్యాహ్నం 2గంటలకు కిందుమండ నుండి ఆదిబాబు.. తన సహచరుడు శ్రీధర్ ని ఎక్కించుకుని బైక్ పై బయలు దేరారు. పాడేరు ఘాట్ రోడ్ నుండి వెలుతుండగా జోరున వర్షం కురుస్తుంది. మద్యాహ్నం ముడున్నరకు.. రాజపురం దాటి కొంచెం ముందుకు వెళ్ళి సరికి.. కోతులు గుంపు వద్ద పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం వచ్చిన వెంటనే వారి బండి ని డ్రైవ్ చేస్తున్న శ్రీదర్.. కుప్పకూలిపోయాడు.

ఇవి కూడా చదవండి

తలకు ఎడమ భాగంలో బలమైన గాయం..

– వెనుక కూర్చున్న ఆదిబాబు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు ఇద్దరూ కింద పడిపోయారు. ఏం జరిగిందో ఆది బాబుకు తెలియదు. కింద పడ్డ శ్రీధర్ ను లేపే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఎడమ చెవి భాగాన తలకి బలమైన గాయంతో రక్తం కారుతునంట్టు గుర్తించి అవాక్కయ్యాడు అది బాబు. కుప్పకూలిపోయిన శ్రీధర్ ను చూసి బోరున విలపించాడు ఆదిబాబు. ఘాట్రోడ్లో వెళ్లే వాహనదారుల సహకారంతో.. శ్రీధర్ ని ప్రైవేట్ వాహనంలో ఎక్కించుకుని పాడేరు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అప్పటికి శ్రీదర్ ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్ ధృవీకరించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం చేసి.. మృతుడి తలలో పిల్లేట్ బయటకు తీసారు.

పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా హత్య కేసు..

డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గన్ షాట్ తో తలకి గాయం అయి శ్రీధర్ ప్రాణాలకు కోల్పోయినట్టు నిర్ధారించడంతో హత్య కేసు గా ఆల్టర్ చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. పాడేరు ఏఎస్పీ ధీరజ్ ప్రత్యేకంగా కేసు పై దృష్టి సారించారు. ఘటనా స్థలంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో నాటు తుపాకీ లతో వేటకు వెళ్లే వారి కోసం ఆరా తీసారు. వాళ్ళకోసం ఎంక్వయిరీ చేయించారు. సాంకేతిక ఆధారంగా నిందితుడి సెల్ఫోను ట్రాక్ చేశారు. సుబ్బారావు నిందితుడుగా గుర్తించి.. అతని కోసం గాలించారు. నిందితుడు.. వంట్లమామిడి సర్పంచ్ సహకారంతో లొంగిపోయాడు. సుబ్బారావును అరెస్ట్ చేసిన పోలీసులు.. నాటు తుపాకీతో పాటు పిల్లేట్లు, పేలుడు పదార్థాలు స్వాదీనం చేసుకున్నామని అన్నారు పాడేరు ఏఎస్పీ ధీరజ్.

– కోతులను వేటాడేందుకు తుపాకీ పేలిస్తే.. ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న అమాయకుడు ప్రాణాలకు కోల్పోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే.. ఈ ఘటన తర్వాత ఈ కేసులో ఇప్పటికే సుబ్బారావును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంకా నాటు తుపాకులను వినియోగిస్తున్న వారు, వన్యప్రాణులను వేటాడే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అవగాహన పెంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పోలీసులు. గతంలోనూ నాటు తుపాకీ లో పేలి గిరిజనులు ప్రాణాలకు కోల్పోయిన సంఘటనలో పాడేరు ఏజెన్సీలో ఉన్నాయి. జంతువులను వేటాడడం గిరిజనుల వృత్తి అయినప్పటికీ.. ఇలా మనుషుల ప్రాణాల పైకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి