మైమరిపిస్తోంది..! అందమైన గోదావరి జలాలపై తేలియాడుతున్న ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్..!
గోదావరి మధ్యలో ఉన్న ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు టూరిజం శాఖతోపాటు సిల్వర్ స్పూన్ , ఆహ్వానం సంయుక్తంగా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను నిర్వహించనున్నారు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో బోట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ని ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. టూరిస్టులు బోటులో ప్రయాణం చేసి గోదావరి మధ్యలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపే విధంగా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం దాదాపు 300 నుంచి 400 మంది వరకు గోదావరిలో విహరించేలా ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులతో పాటు రాజమండ్రి చుట్టుపక్కలున్న వారు కూడా గోదావరి మధ్యలో ఉన్న ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు టూరిజం శాఖతోపాటు సిల్వర్ స్పూన్ , ఆహ్వానం సంయుక్తంగా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను నిర్వహించనున్నారు
ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా ఈ ఫ్లోటింగ్ బోర్డ్ రెస్టారెంట్ తీసుకువచ్చారు టూరిజం శాఖ. శాకాహారం, మాంసాహారం తో పాటు, గోదావరి రుచులను అందమైన గోదావరి నదీపాయ మధ్యలో కుటుంబ సమేతంగా సేద తీరుతూ ఎంజాయ్ చేయనున్నారు పర్యాటకులు. పుట్టినరోజు వేడుకలతో పాటు, కిడ్డీ పార్టీస్.. పలు రకాల శుభకార్యాలు కూడా చేసుకున్నందుకు వెసులుబాటు ఉందంటున్నారు నిర్వాహకులు. బయట రెస్టారెంట్లో ఏ రకంగా సెటప్ ఉంటుందో దానికి మించి ఏసీ హంగులతో బోట్‌లో రెస్టారెంట్ ఉంటుంది. అంతేకాకుండా.. ఫ్లోటింగ్ ఎక్కువ వస్తే గోదావరి ఇసుక తిన్నల మధ్య నైట్ డిన్నర్‌ను కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సుధీర ప్రాంతాల నుంచి పర్యాటకులకు ఈ బోర్డ్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కనువిందు చేయనుంది.
వీడియో చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..