Viral Video: వంటింట్లో ఏడడుగుల కోడె నాగు బుసలు.. హడలెత్తిపోయిన ఇల్లాలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో
ఇంట్లోకి దూరి బుసలుకొడుతూ హల్చల్ చేసిన ఏడు అడుగుల కోడెనాగు పామును పట్టుకునేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ సైతం హడలెత్తిపోయాడు. చుట్టుపక్కల వారికి వినిపించేలా బుస కొట్టిన కోడెనాగు జనాల గుండెల్లో వణుకు పుట్టించింది. వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావం వలన అడవుల్లో ఉండాల్సిన..

కర్నూలు, నవంబర్ 13: ఇంట్లోకి దూరి బుసలుకొడుతూ హల్చల్ చేసిన ఏడు అడుగుల కోడెనాగు పామును పట్టుకునేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ సైతం హడలెత్తిపోయాడు. చుట్టుపక్కల వారికి వినిపించేలా బుస కొట్టిన కోడెనాగు జనాల గుండెల్లో వణుకు పుట్టించింది. వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావం వలన అడవుల్లో ఉండాల్సిన కోడే నాగులు, కొండచిలువలు జనావాసాల మధ్య సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవి ప్రాంతానికి సమీపంలో ఉండే మహానంది మండలం నిత్యం ఎదో ఒక గ్రామంలో నాగుపాములు, కొండచిలువలు హల్ చల్ చేస్తుంటాయి.
గత పది రోజులుగా మండలంలోని తిమ్మాపురం, శ్రీనగర్, మహానంది గ్రామాల్లో నాగుపాములు, కొండచిలువలు కలకలం రేపుతున్నాయి. అతి పొడవైన కోడెనాగు, కొండచిలువలు సంచరించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహానంది మండలం శ్రీనగర్ గ్రామంలోని రైతు మహానంది ఇంటి వంటిట్లోకి బుధవారం మద్యాహ్నం అరుదైన ఏడు అడుగుల పొడవైన కోడె నాగు బుసలు కొడుతూ హల్ చల్ చేసింది. బుస్.. బుస్.. అంటు బుసలు కొడుతూ కోడె నాగు శబ్థాలు చెయ్యడంతో రైతు మహానంది కుటుంబం తీవ్ర భయభ్రాంతులకు గురైంది. వెంటనే రైతు మహానంది మండలంలోని స్నేక్ క్యాచర్ అయిన మోహన్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన స్నేక్ క్యాచర్ మోహన్ రంగంలోకి దిగి కిచెన్ రూమ్ లోని తొర్రలో దాక్కున్న కోడె నాగును పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు.
కోడే నాగు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూండగా బుసలు కడుతూ స్నేక్ క్యాచర్‌ను సైతం భయపెట్టింది. ఎంతో చాకచక్యంగా అరుదైన కోడేనాగును పట్టుకొని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు. దీంతో శ్రీనగర్ గ్రామస్థులు, రైతు మహానంది కుటుంబం ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన అదే రోజు రాత్రి మహానంది మండలం పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ గురైన కారులో కొండచిలువ హల్ చల్ చేసింది. కొండచిలువ సచారంపై పోలీసులు స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న మోహన్ కారు క్రింది భాగాంలో దాక్కున్న కొండచిలువను ధైర్యసాహసాలతో పట్టుకున్నాడు. స్నేక్ క్యాచర్ మోహన్ ప్రతిభను పొగుడుతూ చిన్నారులు చప్పట్లు కొట్టి అభినందించారు.
ఒకే రోజు రెండు చోట్ల పాము, కొండచిలువ పట్టుకోవడం గ్రామస్తులను భయాందోళనకి గురి చేస్తుంది. నాగుపాములు, కొండచిలువలను పట్టుకోవడంలో ఎక్స్ ఫర్ట్ అయిన స్నేక్ క్యాచర్ మోహన్ మండలంలోని అయ్యన్న నగర్ లో ఉంటున్నాడు. ఏ అర్థరాత్రి అయిన సమాచారం ఇస్తే వెంటనే వచ్చి పాములను బంధించి జనాలను కాపాడుతున్నాడు. దీంతో నల్లమల సమీపంలో ఉండే గ్రామస్థులు కొంత ధైర్యంగా జీవిస్తున్నారు. పాములు, కొండచిలువల సంచారం గురించి ఫారెస్ట్ అధికారులు పలు సూచనలు చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహానంది మండలం నల్లమల అడవిలో ఉండటం వలన పాములు, కొండచిలువలు సంచరించడం అక్కడ షరా మాములే. అయినప్పటికీ స్థానికుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




