UPSC Civils Mains 2023: యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో తెలుగోళ్ల సత్తా.. మెయిన్స్‌కు ఏకంగా 600 మంది ఎంపిక

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్ష 2023 ఫలితాలు సోమవారం (జూన్‌ 12) విడుదలైన సంగతి తెలిసిందే. మే 28వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది వరకు..

UPSC Civils Mains 2023: యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో తెలుగోళ్ల సత్తా.. మెయిన్స్‌కు ఏకంగా 600 మంది ఎంపిక
UPSC Mains

Updated on: Jun 13, 2023 | 2:00 PM

UPSC CSE Results 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్ష 2023 ఫలితాలు సోమవారం (జూన్‌ 12) విడుదలైన సంగతి తెలిసిందే. మే 28వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది వరకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 14,624 మంది మెయిన్‌ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,128 మంది దరఖాస్తు చేయగా.. వారిలో సుమారు 45,000ల మంది పరీక్ష రాశారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 200లకు కటాఫ్‌ మార్కులు 80 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐతే యూపీఎస్‌సీ మాత్రం ఇప్పటివరకూ కటాఫ్‌ మార్కులను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్‌ పరీక్షలకు హాజరుకావడానికి తప్పనిసరిగా డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌-1 (DAF-1) పూరించవల్సి ఉంటుంది. తుదుపరి దశ అయిన మెయిన్‌ పరీక్షలు సెప్టెంబరు 15 నుంచి 5 రోజులపాటు జరగనున్నాయి. కాగా మొత్తం 1105 పోస్టులకు యూపీఎస్సీ నియామక ప్రక్రియ చేపడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.