Bapatla District: బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. అతడి వద్ద ఉన్న బ్యాగ్ చెక్ చేయగా..

ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. అయితే అతడి వద్ద ఉన్న బ్యాగ్‌లో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన వజ్రాలు, బంగారు నగలు ఉన్నాయి.

Bapatla District: బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. అతడి వద్ద ఉన్న బ్యాగ్ చెక్ చేయగా..
Diamonds (Representative image)
Follow us

|

Updated on: Nov 25, 2022 | 2:54 PM

ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ట్రావెల్  చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు దగ్గర చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని బొబ్బా పవన్ కుమార్(41) గా గుర్తించారు. అతడి సొంతూరు చిత్తూరు జిల్లాలోని భీమవరం. ప్రస్తుతం గుంటూరులోని కిషన్ జ్యూయలరీలో పనిచేస్తున్నాడు. అతను తిరుపతి నుంచి గుంటూరు వచ్చి 3 నెలలు అవుతుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కుమార్ తిరుపతిలోని కిషన్ జ్యూయలరీ మార్కెటింగ్​ విభాగంలో సేల్స్ మ్యాన్‌గా తిరుపతిలో పని చేసేవాడు. 3 నెలల క్రితం బదిలీపై గుంటూరు వచ్చాడు. సండే మార్నింగ్  గుంటూరు నుండి వజ్రాలు పొదిగిన నెక్లెస్ తీసుకొని ఒంగోలులోని ఓ ఆభరణాల షాపునకు వెళ్లాడు. అక్కడ ఆ వస్తువులను చూపించి నైట్ సుమారు 10 గంటల సమయంలో ఒంగోలు ఆర్టీసీ డిపోకి చేరుకున్నాడు. అక్కడి నుంచి గుంటూరు వెళ్లేందుకు కనిగిరి టూ విజయవాడ వెళ్లున్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు.

మార్గమధ్యంలో  కొరిశపాడు వద్ద రాత్రి 11 గంటల సమయంలో.. పవన్‌ ఛాతినొప్పి వచ్చింది. అతడు ఇబ్బంది పడటాన్ని గమనించిన పక్కనున్న వ్యక్తి.. వెంటనే డ్రైవర్‌కు విషయం చెప్పాడు. డ్రైవర్ బస్సు వెంటనే 108 కాల్ చేశాడు. 108 స్టాఫ్ వచ్చి.. అప్పటికే అతడు మరణించినట్లు నిర్ధారించారు. డ్రైవర్​ సమాచారంతో పోలీసులు స్పాట్‌కు వచ్చి.. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అతడు ఆభరణాల షాపులో పని చేస్తాడని నిర్ధారించుకున్నారు. బస్సులో మృతుడు కూర్చున్న ప్రాంతంలో చూడగా ఓ బ్యాగ్ కనిపించింది.

ఆ బ్యాగ్ ఓపెన్ చేయగా సుమారు రూ.కోటి విలువైన 47 వజ్రాలు, గోల్డ్ జ్యూయలరీ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పవన్ డెడ్‌బాడీని అద్దంకి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సోమవారం జ్యూయలరీ కంపెనీకి చెందిన వ్యక్తులు సరైన డాక్యుమెంట్స్ తీసుకురావడంతో.. వజ్రాలు, బంగారు నగలను వారికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!