Andhra Pradesh: మత్స్యకారులకు చిక్కిన 24 కిలోల భారీ పండుగప్ప చేప..
కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం బైరవపాలెంలో ఓ భారీ చేప దొరికింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లగా పండుగప్ప అనే భారీ చేప వలలో చిక్కింది. 24 కేజీలున్న ఈ భారీ పండుగప్ప చేపను యానాం కు చెందిన మత్యకారుడు మహిపాల చిన్న అనే వ్యక్తి 17,500/ రూపాయల కు వేలం పాటలో దక్కించుకున్నాడు.

అయితే ఈ పండుగప్ప చేపను అమ్మితే దాదాపు 25,000 రూపాయల వరకు లాభం వస్తుందని మత్యకరాడు మహిపాల చిన్న చెబుతున్నాడు. సాధారణంగా అయితే రెండు కేజీల నుంచి 10 కేజీల వరకు మాత్రమే పండుగప్ప చేపలు సముద్రంలో దొరుకుతూ ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే భారీ చేపలు చిక్కుతుంటాయి.
భైరవపాలెం లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 24 కేజీల భారీ పండుగ చేప వలకు చిక్కడం అందర్నీ ఆశ్చర్యం కలిగించింది. గతంలో కూడా 20,15 కేజీ ల పండుగప్ప చేపలు దొరకగా ఇప్పుడు 24 కేజీ ల పండుగప్ప దొరకడంతో మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పండుగప్ప చేప సముద్రపు ఉప్పు నీటిలో,మంచి నీటి నదులలో పెరగడం వీటి ప్రత్యేకత. చేపలలో రారాజు అయిన పండుగప్ప చేప మాంస ప్రియులకు ఇగురు పెట్టేందుకు అత్యంత ఇష్టమైన చేప.