AP News: పైలెట్ వాహనాల మాదిరి దూసుకొచ్చారు.. కొంచెం తేడాతో అసలు గుట్టు రట్టు.. కంగుతిన్న పోలీసులు..!

AP News: వరుసగా వాహనాలు దూసుకొస్తున్నాయి. ఒక్కో వాహనం సమానమైన దూరం పాటిస్తున్నాయి. రెండు పెద్ద వాహనాలు, వాటిని ప్రోటెక్షన్ మాదిరిగా ఐదు

AP News: పైలెట్ వాహనాల మాదిరి దూసుకొచ్చారు.. కొంచెం తేడాతో అసలు గుట్టు రట్టు.. కంగుతిన్న పోలీసులు..!
Police
Follow us

|

Updated on: May 28, 2022 | 6:30 PM

AP News: వరుసగా వాహనాలు దూసుకొస్తున్నాయి. ఒక్కో వాహనం సమానమైన దూరం పాటిస్తున్నాయి. రెండు పెద్ద వాహనాలు, వాటిని ప్రోటెక్షన్ మాదిరిగా ఐదు బైకులతో రయ్‌మని వస్తున్నాయి. చూసేవారికి నార్మల్‌గానే అనిపిస్తుంది. కానీ, దాని వెనుక పెద్ద బాగోతమే ఉంది. అది బట్టబయలు అవడంతో పోలీసులే షాక్ అయ్యారు. సాధారణంగా పైలట్ వాహనాల మాదిరిగా వస్తున్న ఈ వెహికిల్స్‌ను చూసి సామాన్యులు ఎవరో వెళ్తున్నట్లు అనుకుంటారు. కానీ, పోలీసులకు అన్నీ తెలుసు కదా.. అదే ఆ కేటుగాళ్లకు ఝలక్ ఇచ్చింది. వారు గుట్టుగా సాగిస్తున్న అసలు దందా బహిర్గతం చేశారు. మొదట పోలీసులు కూడా లైట్ తీసుకున్నప్పటికీ.. ఆ తరువాత ఎక్కడో తేడా కొట్టడంతో కాస్త ఫోకస్ చేశారు. దాంతో అసలు మ్యాటర్ తెలియడంతో.. పోలీసులే కళ్లు తేలేశారు. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అనకాపల్లి జిల్లాలో రెండు కోట్లకు పైగా విలువైన గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. చీడికాడలో అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు.. అనుమానాస్పదంగా కొంతమంది కనిపించారు. వారిని ఆపి చెక్ చేయగా.. ఒక్కొక్కరుగా బయటపడ్డారు. చివరకు ఓ నెట్వర్క్ మాదిరిగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వాహనాల్లో తరలిస్తున్న 3,500 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. పదకొండు మంది నిందితులను అరెస్టు చేసి.. రెండు వ్యాన్లు, అయిదు బైకులను సీజ్ చేశారు. ఫైలెటింగ్ వ్యవస్థ మాదిరిగా గంజాయి నెట్వర్క్స్‌ నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా అయితే, ఎవరికీ అనుమానం రాదని, ఇదే విధానాన్ని ఎంచుకుని అక్రమంగా గంజాయిని సరిహద్దులు దాటించేస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.