బాబోయ్‌.. కుక్కలు కరుస్తున్నాయ్‌..! వీధి కుక్కల స్వైర విహారంతో బిక్కుబిక్కుమంటున్న జనం

|

Mar 06, 2023 | 4:32 PM

ఓ వైపు పసివాడు ప్రదీప్‌ ప్రాణాలు తీసిన కుక్కలను నియంత్రణకు ప్రభుత్వం హైలెవెల్‌ కమిటీలు వేసి... ఏవేవో చేస్తున్నామని చెపుతున్నా...నగరంలో కుక్కల దాడులకు మాత్రం ఫుల్‌స్టాప్‌ పడడంలేదు. అయినవిల్లి మండలంలో పిచ్చికుక్కలు జనంపై ఎటాక్‌ చేస్తూ కలకలం రేపుతున్నాయి. ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా పదిహేనుమందిపై దాడిచేశాయి.

బాబోయ్‌.. కుక్కలు కరుస్తున్నాయ్‌..! వీధి కుక్కల స్వైర విహారంతో బిక్కుబిక్కుమంటున్న జనం
Street Dogs
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు హడలెత్తిస్తున్నాయి. పల్లె, పట్టణం తేడా లేదు. వీధుల్లో వీధి కుక్క‌లు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. ప్రజల్ని భ‌యబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎక్కడ చూసినా వీధి కుక్కుల స్వైర విహారం పెరిగిపోయింది. ఒకేచోట రెండు మూడు కంటే ప‌దుల సంఖ్యలో కుక్కలు తిరుగుతున్నా యి. వీధి కుక్క‌లే క‌దా అనుకుని ప‌క్క‌నుంచి వెళ‌దామనుకుంటే ఎక్క‌డ దాడి చేస్తాయో అని చిన్నారులు, పెద్ద‌లు కూడ జంకుతున్నారంటే ప‌రిస్థితి ఏవిధంగా మారిందో అర్థం చేసుకోవ‌చ్చు. పిచ్చికుక్కల దాడులకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏ వైపు నుంచి ఏ కుక్క దాడిచేస్తుందో తెలియక పిల్లలు పెద్దలు బిక్కుబిక్కుమంటున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గత రెండు రోజులుగా రెండు గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వేర విహారం చేస్తున్నాయి. కోనసీమ జిల్లా…అయినవిల్లి మండలంలో పిచ్చికుక్కలు జనంపై ఎటాక్‌ చేస్తూ కలకలం రేపుతున్నాయి. తొత్తర ముడి, శానంపల్లి లంకలో పిచ్చికుక్కలు ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా పదిహేనుమందిపై దాడిచేశాయి.

8 మంది ఆడవాళ్లు, ఐదుగురు మగవాళ్ళు ఇద్దరు పిల్లలపై కుక్కలు దాడిచేసి, తీవ్రంగా గాయపర్చాయి. పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మొహం, కాళ్ళు, చేతులపై కుక్కలు ఇష్టంవచ్చినట్టు కరిచేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కుక్కకాటుకి గురైన వారు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గత కొద్దిరోజులుగా కుక్కలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేరంటూ వాపోతున్నారు గ్రామస్తులు.

ఇక హైదరాబాద్‌లో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖైరతాబాద్‌లో పిచ్చికుక్కలు ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేశాయి. జీహెచ్‌ఎంసీ కార్మికురాలికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఓ వైపు పసివాడు ప్రదీప్‌ ప్రాణాలు తీసిన కుక్కలను నియంత్రణకు ప్రభుత్వం హైలెవెల్‌ కమిటీలు వేసి… ఏవేవో చేస్తున్నామని చెపుతున్నా…నగరంలో కుక్కల దాడులకు మాత్రం ఫుల్‌స్టాప్‌ పడడంలేదు. అడుగుబయటపెట్టాలంటే నగరవాసులు హడిలిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తల కోసం..