YS Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..

|

Apr 16, 2023 | 5:22 PM

వైఎస్ వివేకానంద హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది సీబీఐ కోర్ట్. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దాంతో భాస్కర్ రెడ్డిని చంచల్‌గూల జైలుకు తరలిస్తున్నారు సీబీఐ అధికారులు. కాగా, వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆదివారం ఉదయం వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు..

YS Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..
Ys Bhaskar Reddy
Follow us on

వైఎస్ వివేకానంద హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది సీబీఐ కోర్ట్. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దాంతో భాస్కర్ రెడ్డిని చంచల్‌గూల జైలుకు తరలిస్తున్నారు సీబీఐ అధికారులు. కాగా, వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆదివారం ఉదయం వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. ఇంతకు ముందే సీబీఐ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి.. భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఇక అంతకు ముందు.. పులివెందులలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. నేరుగా ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో వై.ఎస్‌.భాస్కర్‌ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో దాదాపు గంటన్నర పాటు భాస్కర్‌రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 2D ఎకో టెస్టు నిర్వహించి, మెడికల్ సర్టిఫికెట్ అందజేశారు ఉస్మానియా డాక్టర్లు. ఆ సర్టిఫికెట్లను సీబీఐ జడ్జి ఎదుట సమర్పించారు అధికారులు. అన్నీ పరిశీలించిన ధర్మాసనం.. భాస్కర్ రెడ్డికి ఏప్రిల్ 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..