Viral Video: పొలం పనులకు వెళ్తుండగా కనిపించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యాన్ని చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

|

Apr 11, 2023 | 5:12 PM

ఇటీవల వన్యమృగాలు అడవి బాటను వీడి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, కొండచిలువలు, పాములు.. ఇలా అన్ని రకాల వన్య ప్రాణులు ప్రజల మధ్యలోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం సమ్మర్‌ సీజన్‌ నడుస్తుంది.

Viral Video: పొలం పనులకు వెళ్తుండగా కనిపించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యాన్ని చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
King Cobra
Follow us on

ఇటీవల వన్యమృగాలు అడవి బాటను వీడి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, కొండచిలువలు, పాములు.. ఇలా అన్ని రకాల వన్య ప్రాణులు ప్రజల మధ్యలోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం సమ్మర్‌ సీజన్‌ నడుస్తుంది. వేసవి తాపంతో దాహం వేసి కొండచిలువలు, పాములు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో 13 అడుగుల కింగ్‌ కోబ్రా తీవ్ర కలకలం రేపింది. కంచిలి మండలం కుమ్మరినౌగాంలో నివాసాల వద్ద కింగ్‌ కోబ్రా తచ్చాడుతూ ఉండగా స్థానికులు గుర్తించారు. భయాందోళనకు గురైన వారు వెంటనే సోంపేటకు చెందిన పాములు పట్టే బాలరాజుకు సమాచారమందించారు. అతను చాకచక్యంగా కింగ్‌ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారి సూచనల మేరకు కింగ్‌కోబ్రాను అటవీ ప్రాంతంలో వదిలివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా కంచిలి మండల పరిధిలో జలంత్రకోట, బొగాబెణి తదితర ప్రాంతాల్లో ఇటీవల తరచూ కింగ్‌ కోబ్రాలు కనిపిస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

2 రోజుల క్రితం కూడా..

కాగా రెండు రోజుల క్రితం ఇదే శ్రీకాకుళం జిల్లాలో 12 అడుగుల పాము హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. సోంపేటలోని జింకిభద్ర కాలనీలో ఓ ఇంటి ముందు 12 అడుగుల పాము తీవ్ర కలకలం రేపింది. భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే సోంపేటకు చెందిన స్నేక్ క్యాచర్ బాలయ్యకు సమాచారమిచ్చారు. బాలయ్య వచ్చి చాకచక్యంగా పామును బంధించారు. అనంతరం అటవీ అధికారుల సూచనలతో అటవీ ప్రాంతంలో వదిలివేశారు. కాగా ఇది కూడా సుమారు 12 అడుగులకు పైగా పొడవు, 10 కిలోల బరువు ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి