మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. కార్మికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. 16మంది మృతి, 14మందికి గాయాలు
ఉత్తర మెక్సికో సరిహద్దు రాష్ట్రం సోనోరాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
US road accident: ఉత్తర మెక్సికో సరిహద్దు రాష్ట్రం సోనోరాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. గని కార్మికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా నోచే బ్యూనా గనికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులంతా మెక్సికో ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also.. మరోసారి బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి.. సెకండ్ వేవ్‌తో షేక్ అవుతున్న జనం.. అప్రమత్తమైన కేంద్రం..!