అగ్రరాజ్యంలో చేతులు మారబోతోన్న అధికారపీఠం.. విజయానికి చేరువలో జో బైడెన్

అగ్రరాజ్యం అమెరికాలో అధికారపీఠం చేతులు మారే సూచనలు స్పష్టమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రత్యర్థి జో బైడెన్‌ వెనక్కినెడుతున్నారు. డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ తన సత్తా చాటుతూ డోనాల్డ్ ట్రంప్ కు షాకుమీద షాకులిస్తున్నారు. తాజాగా మిచిగన్‌లో బైడెన్‌ విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. దీంతో శ్వేత సౌధం వైపుగా బైడెన్‌ అడగులు పడుతున్నాయి. ప్రస్తుతానికి ట్రంప్‌ 214 ఓట్లు మాత్రమే […]

  • Venkata Narayana
  • Publish Date - 6:45 am, Thu, 5 November 20
అగ్రరాజ్యంలో చేతులు మారబోతోన్న అధికారపీఠం.. విజయానికి చేరువలో జో బైడెన్

అగ్రరాజ్యం అమెరికాలో అధికారపీఠం చేతులు మారే సూచనలు స్పష్టమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రత్యర్థి జో బైడెన్‌ వెనక్కినెడుతున్నారు. డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ తన సత్తా చాటుతూ డోనాల్డ్ ట్రంప్ కు షాకుమీద షాకులిస్తున్నారు. తాజాగా మిచిగన్‌లో బైడెన్‌ విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. దీంతో శ్వేత సౌధం వైపుగా బైడెన్‌ అడగులు పడుతున్నాయి. ప్రస్తుతానికి ట్రంప్‌ 214 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అయితే, మిచిగన్‌ ఫలితాలపై ట్రంప్‌ అక్కడి రాష్ట్ర కోర్టులో దావా వేశారు. ఓటింగ్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిపబ్లిక్‌ పార్టీ ఆరోపిస్తోంది. కాగా,  మ్యాజిక్ ఫిగర్ 270 కు బైడెన్ కేవలం 6 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే తక్కువలో ఉండటంతో బైడెన్ అగ్రరాజ్యాధినేత కాబోతోన్న సూచనలు ప్రస్పుటమవుతున్నాయి.  జో బైడెన్‌కు అమెరికా చరిత్రలో ఎవరికీరానన్ని ఓట్లు. !