జో బైడెన్‌కు అమెరికా చరిత్రలో ఎవరికీరానన్ని ఓట్లు. !

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ పై పోటీపడుతోన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బైడెన్ అమెరికా చరిత్రలో ఏ అభ్యర్థికీ రానన్ని ఓట్లను సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బైడెన్ 7.16 కోట్లకు పైగా ఓట్లను పొందగలిగారు. ఇప్పటివరకూ అత్యధిక ఓట్ల రికార్డు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరిట ఉండేది. 2008లో జరిగిన ఎన్నికల్లో ఒబామాకు […]

జో బైడెన్‌కు అమెరికా చరిత్రలో ఎవరికీరానన్ని ఓట్లు. !
Follow us

|

Updated on: Nov 05, 2020 | 7:21 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ పై పోటీపడుతోన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బైడెన్ అమెరికా చరిత్రలో ఏ అభ్యర్థికీ రానన్ని ఓట్లను సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బైడెన్ 7.16 కోట్లకు పైగా ఓట్లను పొందగలిగారు. ఇప్పటివరకూ అత్యధిక ఓట్ల రికార్డు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరిట ఉండేది. 2008లో జరిగిన ఎన్నికల్లో ఒబామాకు అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లు వచ్చాయి. ఈ రికార్డును ఇప్పుడు బైడెన్ అధిగమించారు. ఇక, ఈ ఎన్నికల్లో ట్రంప్ కు ఇప్పటివరకూ 6.83 కోట్లకు పైగా ఓట్లు లభించాయి.  అగ్రరాజ్యంలో చేతులు మారబోతోన్న అధికారపీఠం.. విజయానికి చేరువలో జో బైడెన్