Travel Advisory: కాస్త సేఫ్ ! ఇండియాపై ట్రావెల్ ఆంక్షలను మరింత తగ్గించిన అమెరికా
ఇండియాపై ట్రావెల్ (ప్రయాణ సంబంధ) ఆంక్షలను అమెరికా మరింత తగ్గించింది. వీటిని రెండో దిగువ స్థాయికి కుదించింది. ఇండియాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు సాధారణ స్థాయిలో ఉన్నందున అమెరికన్లు రెండు డోసులూ (పూర్తిగా) వ్యాక్సిన్ తీసుకున్న
ఇండియాపై ట్రావెల్ (ప్రయాణ సంబంధ) ఆంక్షలను అమెరికా మరింత తగ్గించింది. వీటిని రెండో దిగువ స్థాయికి కుదించింది. ఇండియాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు సాధారణ స్థాయిలో ఉన్నందున అమెరికన్లు రెండు డోసులూ (పూర్తిగా) వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలో కోవిడ్ కాంట్రాక్టింగ్ రిస్క్ పెద్దగా ఉండబోదని అమెరికా అంటువ్యాధుల నివారణా విభాగం తన ట్రావెల్ అడ్వైజరీలో స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనుకునేవారు మొదట టీకామందు తీసుకున్నవారికి-తీసుకోని వారికి మధ్య తేడాకు సంబంధించి తాము చేసిన సిఫారసులు, సూచనలను పరిశీలించాలని ఈ విభాగం కోరింది. అయితే ఇండియాలో తూర్పు లడాఖ్ ప్రాంతానికి తప్ప జమ్మూ కాశ్మీర్ కి ప్రయాణించరాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేకంగా సూచించింది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద భయం, సివిల్ ఆన్-రెస్ట్ (అభద్రత) ఇంకా కొనసాగుతున్నాయని ఈ శాఖ అధికారుల తెలిపారు. పైగా భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో 10 కి.మీ. దూరం పరిధి వరకు కూడా వెళ్లవద్దని వారు తమ అమెరికన్లను కోరారు.
ఇండియాలో కోవిడ్ కేసులు తీవ్రంగా ఉన్నప్పుడు గత ఏప్రిల్ 30 న అధ్యక్షుడు జోబైడెన్ ట్రావెల్ ఆంక్షలు విధించారు. ఆ దేశానికి వెళ్లగోరినవారు తప్పనిసరిగా ఈ ఆంక్షలను గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాగే టర్కీకి సంబంధించి కూడా ఈ విధమైన నిబంధనలను విధించారు. ఆ దేశానికి గాను నాలుగో స్థాయి హై కోవిడ్ అలర్ట్ ఉత్తర్వులను జారీ చేశారు. లోగడ ఇండియాతో సహా బ్రిటన్, యూరప్ దేశాల ప్రజల రాకపోకలపై సైతం బ్యాన్ విధించిన విషయం గమనార్హం. అమెరికా ఇప్పటికీ 70 దేశాలకు సంబంధించి ట్రావెల్ అడ్వైజరీని పాటిస్తోంది. ఇలా ఉండగా భారత్ లో సోమవారం నాటికి 32 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 417 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. ఈ తాజా పరిణామాలను కూడా అమెరికా తన ట్రావెల్ అడ్వైజరీలో ప్రస్తావించింది.
మరిన్ని ఇక్కడ చూడండి : స్మశానంలో పసికందు ఏడుపు..! దగ్గరకి వెళ్లి చుస్తే షాక్.. వైరల్ అవుతున్న వీడియో..:Babe Cemetery Viral Video.
అల్లు అర్జున్ , మహేష్ బాబు సినిమాలకు షాక్.. బడా మూవీలకు తప్పని లీకుల బాధ..:Movie Scenes Leak Video.
డేంజరస్ ఫుడ్.. ఇవి తింటే అంతే..!ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటున్న నిపుణులు..:Toxic Food Video.