అమెరికా ఎన్నికలు, ఫేస్ బుక్ అప్రమత్తం, యాడ్స్ ఫై ‘బ్యాన్’ !
అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ అప్రమత్తమైంది. ఓటింగ్ ను భంగపరచేందుకు ఉద్దేశించిన 20 లక్షలకు పైగా యాడ్స్ ను తిరస్కరించడమే గాక, లక్షా ఇరవై వేల పోస్టులను తొలగించింది.
అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ అప్రమత్తమైంది. ఓటింగ్ ను భంగపరచేందుకు ఉద్దేశించిన 20 లక్షలకు పైగా యాడ్స్ ను తిరస్కరించడమే గాక, లక్షా ఇరవై వేల పోస్టులను తొలగించింది. అలాగే తప్పుడు సమాచారానికి సంబంధించిన 150 మిలియన్ ఉదాహరణల తాలూకు హెచ్ఛరికలను కూడా పోస్ట్ చేశామని ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ తెలిపారు. 2016 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా నుంచి ఓటర్ మానిప్యులేషన్ కి జరిగిన యత్నాలను తాము మరిచిపోలేదన్నారు. (ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు). ఇప్పుడు ఆ విధమైన యత్నాలు జరగకుండా చూసేందుకు 35 వేలమంది ఉద్యోగులు అలర్ట్ గా ఉన్నారని నిక్ వెల్లడించారు. అందిన సమాచారం వెరిఫై చేసేందుకుఫ్రాన్స్ తో సహా 70 స్పెషలైజ్డ్ మీడియా సంస్థలతో తాము భాగస్వామ్యం వహిస్తున్నామని నిక్ చెప్పారు.