వాటే ‘ హౌడీ మోడీ ‘ ఈవెంట్ ? ట్రంప్ సారూ వస్తే బెటరే !

భారత, అమెరికా దేశాల మధ్య మైత్రీ బంధం మరింత పటిష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 22 న టెక్సాస్ లో ‘ హౌడీ మోడీ ‘ పేరిట అమెరికాలోని ఇండియన్లు ఓ మెగా ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో బాటు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్టేజీని షేర్ చేసుకోవచ్చునంటున్నారు. అయితే దీన్ని అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఈ అధినేతలిద్దరూ కలిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉభయ దేశాల మధ్య […]

వాటే ' హౌడీ మోడీ ' ఈవెంట్ ?  ట్రంప్ సారూ వస్తే బెటరే !
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 15, 2019 | 3:38 PM

భారత, అమెరికా దేశాల మధ్య మైత్రీ బంధం మరింత పటిష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 22 న టెక్సాస్ లో ‘ హౌడీ మోడీ ‘ పేరిట అమెరికాలోని ఇండియన్లు ఓ మెగా ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో బాటు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్టేజీని షేర్ చేసుకోవచ్చునంటున్నారు. అయితే దీన్ని అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఈ అధినేతలిద్దరూ కలిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉభయ దేశాల మధ్య అత్యంత ప్రధానమైన వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని భావిస్తున్నారు. టారిఫ్ ల విషయంలో గత కొన్ని నెలలుగా రెండు దేశాలూ కాస్త ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న సంగతి తెలిసిందే.ఆ ఒప్పందంతో ఈ ధోరణికి స్వస్తి పలకవచ్చు.

అమెరికాలో స్థిర పడిన సుమారు 50 వేల మంది భారతీయులు ‘ హౌడీ మోడీ ‘ పేరిట ఆయన గౌరవార్థం ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. వచ్ఛే ఏడాది అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేయనున్న ట్రంప్ అభ్యర్థిత్వానికి వీరు అతి ముఖ్యమైన ఓటర్లని తెలుస్తోంది. టెక్సాస్ లో జరిగే ఈ కార్యక్రమానికి ట్రంప్ కూడా హాజరైన పక్షంలో.. మోదీకి ఆయన వ్యక్తిగతంగా గట్టి సపోర్టుగా నిలబడతారనడానికి దాన్ని సంకేతంగా భావించవచ్చునని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మోదీ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై అమెరికా సెనేటర్లలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఈ ‘ పర్సనల్ రాపోర్ట్ ‘ వారి నోళ్లకు కళ్లెం వేయవచ్చుకూడా !

అటు-వాషింగ్టన్ లో గానీ, న్యూయార్క్ లో గానీ మోదీ-ట్రంప్ భేటీ అయినప్పుడు మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. మోదీ ఈ నెల 28 వరకు యుఎస్ లో ఉంటారని, ముఖ్యంగా 27 న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని తెలుస్తోంది. అలాగే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆ సభలో కొద్దిసేపు ప్రసంగించవచ్చు. అప్పుడు యధాప్రకారం ఆయన జమ్మూ కాశ్మీర్ విషయాన్ని ప్రస్తావించి.. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టేందుకు, అంతర్జాతీయ దేశాల దృష్టికి తెచ్చేందుకు యత్నిస్తారని అంటున్నారు.