2020లో జరగనున్న నాటా సభలు..ఇప్పటినుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్

వచ్చే ఏడాది జరగనున్న నాటా ద్వైవార్షిక మహాసభల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అట్లాంటాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై చర్చించేందుకు నాటా బోర్డు మీటింగ్ జరిగింది. డల్లాస్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు 250 మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలనుంచి అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్స్ , బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, రీజినల్ కో ఆర్డినేషన్ మెంబర్స్ హాజరయ్యారు. 2020లో జరిగే నాటా సమావేశాలతో పాటు సంస్ధ నిర్వహిస్తున్న పలు సేవా […]

2020లో జరగనున్న నాటా సభలు..ఇప్పటినుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 28, 2019 | 3:19 PM

వచ్చే ఏడాది జరగనున్న నాటా ద్వైవార్షిక మహాసభల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అట్లాంటాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై చర్చించేందుకు నాటా బోర్డు మీటింగ్ జరిగింది. డల్లాస్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు 250 మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలనుంచి అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్స్ , బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, రీజినల్ కో ఆర్డినేషన్ మెంబర్స్ హాజరయ్యారు. 2020లో జరిగే నాటా సమావేశాలతో పాటు సంస్ధ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వీరంతా చర్చించారు.