గృహ నిర్మాణాల కోసం ఆలయాల భూములా..? గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆగ్రహం
ఏపీలో హిందూ ఆలయాలు, వాటి భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంటోంది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణం కోసం ఆలయల భూముల్ని గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అన్య మతస్తులకు హిందూ ఆలయాల కాంట్రాక్ట్‌లు పాలకమండళ్లలో రిజర్వేషన్లను తప్పుబట్టింది. ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఏపీలో హిందూ ఆలయాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఫౌండేషన్ తప్పుబట్టింది. ఏ మతానికి చెందిన బోర్డు ఆ […]
ఏపీలో హిందూ ఆలయాలు, వాటి భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంటోంది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణం కోసం ఆలయల భూముల్ని గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అన్య మతస్తులకు హిందూ ఆలయాల కాంట్రాక్ట్‌లు పాలకమండళ్లలో రిజర్వేషన్లను తప్పుబట్టింది. ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఏపీలో హిందూ ఆలయాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఫౌండేషన్ తప్పుబట్టింది. ఏ మతానికి చెందిన బోర్డు ఆ మతానికి చెందిన ఆలయాల నిర్వహణ చూసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
పేదలకు భూములిచ్చే పేరుతో హిందూ ఆలయాల భూములపై కన్ను వేశాంటూ మండిపడ్డారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రకాశరావు. కేవలం హిందూ ఆలయాల విషయంలోనే ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయని, ఈ విధానాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.