Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Mask: అమెరికా సంచలన ప్రకటన.. ఇక నుంచి వారికి మాస్క్‌ అవసరం లేదట.. ఎవరినైనా కలువొచ్చు

No Mask: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు పెట్టింది. కరోనా నుంచి ..

No Mask: అమెరికా సంచలన ప్రకటన.. ఇక నుంచి వారికి మాస్క్‌ అవసరం లేదట.. ఎవరినైనా కలువొచ్చు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 09, 2021 | 10:38 PM

No Mask: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు పెట్టింది. కరోనా నుంచి కాపాడుకునేందుకు ఆయుధంగా మాస్క్‌ ధరించడమే. అయితే ఈ క్రమంలో అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారో.. వారు మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రకటన విడుదల చేసింది. అయితే వారు కలిసే ఎదుటి వ్యక్తులు కూడా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసి ఉండాలని సూచించింది. అప్పుడు మాత్రమే మాస్క్‌ ధరించకుండా వారితో కలుసుకోవచ్చని సూచించింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి సంబంధించి సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ సోమవారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. రెండు మోతాదుల టీకా తీసుకున్న వారు ఇకపై ముఖానికి మాస్క్‌ ధరించకుండా ఇతరులను కలుసుకోవచ్చని తెలిపింది. అయితే భారీ జనసమూహాలకు మాత్రం దూరంగానే ఉండాలని సూచించింది.

కాగా, ప్రస్తుతం అమెరికాలో కేవలం 9.2 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, సుమారు 18 శాతం మంది ఒక డోసు టీకా తీసుకున్నారని సీడీసీ తెలిపింది. అందుకే దేశ పౌరులు, నివాసితులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యే వరకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. ఇటీవల దేశంలో కొన్ని రాష్ట్రాలు, నగరాలు, ప్రజారోగ్య నిపుణుల సూచనల మేరకు కోవిడ్‌ ఆంక్షలను ఎత్తివేసినా వైరస్‌ను అరికట్టేందుకు నిబంధనలు పాటిస్తూనే ఉన్నారని సీడీసీ డైరెక్టర్‌ గుర్తు చేశారు.

ఇవి చదవండి :

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే రెండు రోజుల విమాన ప్రయాణాలు చేయకూడదు.. సౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

Helpline Number: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి అన్ని ఫిర్యాదులు చేయాలంటే 139 నెంబర్‌కే..

Corona Cases Update In India: దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!

ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు
అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు?
అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు?
సినిమాకు రూ. 30కోట్లు అందుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్
సినిమాకు రూ. 30కోట్లు అందుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్
ఆ విచిత్ర దొంగను చూసి షాక్ అయిన పోలీసులు..
ఆ విచిత్ర దొంగను చూసి షాక్ అయిన పోలీసులు..
సుప్రీంకోర్టు కొత్త CJI జస్టీస్‌ బీఆర్ గవాయి.. కొలీజియం సిఫార్స
సుప్రీంకోర్టు కొత్త CJI జస్టీస్‌ బీఆర్ గవాయి.. కొలీజియం సిఫార్స
ఈ గ్రామం భూతల స్వర్గం.. వేసవిలో పర్యటించడానికి బెస్ట్ ఎంపిక
ఈ గ్రామం భూతల స్వర్గం.. వేసవిలో పర్యటించడానికి బెస్ట్ ఎంపిక
14 ఏళ్లకు హీరోయిన్.. 15 ఇండస్ట్రీ హిట్స్.. కట్ చేస్తే 36 ఏళ్లకే..
14 ఏళ్లకు హీరోయిన్.. 15 ఇండస్ట్రీ హిట్స్.. కట్ చేస్తే 36 ఏళ్లకే..
త్వరలో రాశిని మార్చుకోనున్న గురువు.. మొత్తం 12 రాశులపై ప్రభావం..
త్వరలో రాశిని మార్చుకోనున్న గురువు.. మొత్తం 12 రాశులపై ప్రభావం..
సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ విక్టరీ.. పోరాడి ఓడిన రాజస్థాన్
సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ విక్టరీ.. పోరాడి ఓడిన రాజస్థాన్