న్యూయార్క్‌లోని బిల్డింగ్‌పై కుప్పకూలిన హెలికాప్టర్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో 51 అంతస్థుల భవనంపై ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. మన్‌హటన్‌లోని బిల్డింగ్‌పై చాపర్ కుప్పకూలడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెప్టెంబర్ 11 తరహా దాడులు రిపీట్ అవుతున్నాయన్న భయంతో అందరు వణికిపోయారు. ఈ ఘటనలో పైలట్ దుర్మరణం చెందాడు. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఘటన జరిగిన వెంటనే భవనంలోని కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఖాళీ చేయించారు. హెలికాప్టరు […]
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో 51 అంతస్థుల భవనంపై ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. మన్‌హటన్‌లోని బిల్డింగ్‌పై చాపర్ కుప్పకూలడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెప్టెంబర్ 11 తరహా దాడులు రిపీట్ అవుతున్నాయన్న భయంతో అందరు వణికిపోయారు.
ఈ ఘటనలో పైలట్ దుర్మరణం చెందాడు. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఘటన జరిగిన వెంటనే భవనంలోని కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఖాళీ చేయించారు. హెలికాప్టరు కూలిన ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం లేదని, వాతావరణం అనుకూలించక జరిగిన ప్రమాదమని పోలీసులు చెప్పారు. కూలిన హెలికాప్టరు కాలిపోయి బూడిదగా మారింది.