Have Aliens Found Us: ఏలియన్స్ ఉన్నాయి.. భూమి మీదకు వచ్చాయి, సౌర్య వ్యవస్థపై పరిశోధనలు చేస్తున్నాయంటున్న ప్రొఫెసర్

భూమి పై ఏలియన్స్ సంచారం ఎప్పుడు సంచలన వార్తే.. తాజాగా హార్వర్డ్ యునివర్సిటీ కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త భూమి మీద ఏలియన్స్ సంచరించాయని .. సౌర్య వ్యవస్థ మీద పరిశోధన చేస్తున్నాయని..

Have Aliens Found Us: ఏలియన్స్ ఉన్నాయి.. భూమి మీదకు వచ్చాయి, సౌర్య వ్యవస్థపై పరిశోధనలు చేస్తున్నాయంటున్న ప్రొఫెసర్
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2021 | 7:32 PM

Have Aliens Found Us: భూమి పై ఏలియన్స్ సంచారం ఎప్పుడు సంచలన వార్తే.. తాజాగా హార్వర్డ్ యునివర్సిటీ కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త భూమి మీద ఏలియన్స్  సంచరించాయని .. సౌర్య వ్యవస్థ మీదపరిశోధన చేస్తున్నాయని తెలిపారు. ఈ ఘటన 2017 అక్టోబర్ లో చోటు చేసుకుందన్నారు.

హార్వర్డ్ కు చెందిన ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ అవీ లోబ్ కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో 2017 అక్టోబర్‌లో మన సౌర వ్యవస్థ పై ఓ నక్షత్ర వస్తువు ప్రభావం చూపించిందని.. అది అసాధారణ లక్షణాలు కలిగి ఉందని చెప్పారు. అది ఖచ్చితంగా ఏలియన్ టెక్నాలజీ కి చెందినదే అని ప్రొఫెసర్ అవీ లోబ్ చెప్పారు. ఆ గ్రహాంతర సాంకేతిక పరిజ్ఞానంతో సౌర వ్యవస్థ ను ప్రభావితం చేయడానికి ఏలియన్స్ పంపించారని ఆ వస్తువు పేరు ‘ఓమువామువా’ అని పేర్కొన్నారు. ఆ వస్తువు అత్యంత వేగంగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఫోటోలు తీసుకుని వెంటనే కనుమరుగైందని తెలిపారు.

ప్రొఫెసర్ లోబ్ చెప్పిన విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోబో హార్వర్డ్‌లో ఖగోళ శాస్త్రంలో ఎక్కువకాలం పనిచేసారని.. నక్షత్రాలపై, గ్రహాంతర వాసులపై అనేక పరిశోధనలు చేశారు. అంతరిక్ష విజ్ఞానంపై అనేక పుస్తకాలను ప్రచురించారు. అంతేకాదు లోబో.. దివంగత స్టీఫెన్ హాకింగ్ వంటి గొప్పవారితో కలిసి పనిచేశారు కనుక ఏలియన్స్ సౌర్య వ్యవస్థపై పనిచేస్తున్నారు కనుక లోబో వాదన తోసిపుచ్చడం కష్టమని కొంతమంది అంటున్నారు.

అయితే లోబ్ ఏలియన్స్ గురించి ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. గ్రహాంతర విజ్ఞానంపై మొదటిసారిగా నవంబర్ 2018 లో ప్రపంచానికి తెలిపారు. ఆ సమయంలో లోబో రచనకు ష్ముయెల్ బియాలి సహకరించారు. లోబో మువామువా ఒక గ్రహాంతర పరిశోధన అని నమ్ముతున్నారు.

Also Read:

రెండు కోట్లకు పైగా అమ్ముడు పోయి సరికొత్త వరల్డ్ రికార్డ్‌ను సృష్టించిన ఆవు..స్పెషాలిటీ ఏమిటంటే!.

 కరోనా నివారణ కోసం అధికారుల కట్టడి.. అసహనంతో జైల్లో బీభత్సం సృష్టించిన ఖైదీలు