సినీ ఫక్కీలో..అమెరికాలో కాల్పులు..పోలీసు, అనుమానితునితో సహా అయిదుగురి మృతి
అమెరికా.కాలిఫోర్నియాలోని వాస్కో సిటీలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు, అనుమానితో సహా అయిదుగురు మరణించారు. అంతకుముందు దుండగునికి, పోలీసులకు మధ్య కొన్ని గంటలపాటు ఫైరింగ్ జరిగింది. ఈ సిటీలో గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా

అమెరికా.కాలిఫోర్నియాలోని వాస్కో సిటీలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు, అనుమానితో సహా అయిదుగురు మరణించారు. అంతకుముందు దుండగునికి, పోలీసులకు మధ్య కొన్ని గంటలపాటు ఫైరింగ్ జరిగింది. ఈ సిటీలో గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాడన్న సమాచారం అందడంతో ఆ వ్యక్తి ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. నగర శివార్లలోని ఆ ఇంటిలో దాక్కున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్ళడానికి సుమారు రెండు గంటలు పట్టినట్టు తెలిసింది. వీరిని చూడగానే ఆ దుండగుడు ఫైరింగ్ చేశాడని. ఆ ఇంటిలో పలుమార్లు గదులను మారుస్తూ కాల్పులు జరిపాడని తెలియవచ్చింది. అతడి ఫైరింగ్ లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, ఒకరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు చెప్పారు. గాయపడిన మరో పోలీసు పరిస్థితి కొంత విషమంగా ఉందన్నారు. చివరకు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
అయితే ఆ ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు కూడా విగతజీవులై కనిపించారు. ఈ వ్యక్తి ఎవరో. ఎందుకు కాల్పులు జరిపాడో, ఆ ఇంటిలోనివారు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ కాల్పుల ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఆ ఇంటిలోనివారికి, ఈ దుండగునికి మధ్య ఏదైనా లింక్ ఉందా అన్న విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదంతా సినీ ఫక్కీలో జరిగిందని పోలీసులు తెలిపారు. అమెరికాలో గన్ కల్చర్ కి స్వస్తి చెప్పాలని మానవతావాదులు కోరుతున్నా అది అంతం కావడంలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి : దంపతులపై చిరుత దాడి..ద్విచక్రవాహనం కొంత దూరం వెంబడించిన తరువాత ఎం జరిగింది..?(వీడియో):Leopard attack Video.
తెలంగాణలో ఎలక్షన్ టాక్ సైడ్ అయిందా?దళిత బంద్ పధకం కాదు ఒక ఉద్యమం..:Big News Big Debate Live Video.