అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సియాటెల్‌లో గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈశాన్య సియోటెల్ ప్రాంతంలో తుపాకీతో వీధుల్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు కారులో ప్రయాణిస్తోన్న ఓ మహిళను అపహరించేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి తప్పించుకునే యత్నంలో అటుగా వస్తున్న మరో మెట్రో బస్సుపై కాల్పులు జరిపాడు. […]

అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 28, 2019 | 10:57 AM

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సియాటెల్‌లో గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈశాన్య సియోటెల్ ప్రాంతంలో తుపాకీతో వీధుల్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు కారులో ప్రయాణిస్తోన్న ఓ మహిళను అపహరించేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి తప్పించుకునే యత్నంలో అటుగా వస్తున్న మరో మెట్రో బస్సుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అయితే వెంటనే తేరుకున్న డ్రైవర్ బస్సును వేగంగా వేరే ప్రాంతానికి తరలించడంతో అందులో ఉన్న 12మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఆ తరువాత దుండగుడు బైక్‌పై వెళ్తోన్న ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. ఇక అదే బైక్‌ను తీసుకొని పారిపోయే ప్రయత్నంలో నిందితుడు మరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనంలోని వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా భారీ సంఖ్యలో పోలీసులు వెంబడించి ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.