NRI News: ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌ యువకుడు మృతి.. స్మిమ్మింగ్ పూల్ లో మునిగి

|

Mar 11, 2022 | 11:24 AM

జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలనే లక్ష్యంతో విదేశానికి వెళ్లాడు. అక్కడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సాధించాడు. ఆనందంగా సాగిపోతున్న సమయంలో ఆ యువకుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. శస్త్రచికిత్స చేసిన...

NRI News: ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌ యువకుడు మృతి.. స్మిమ్మింగ్ పూల్ లో మునిగి
Australia Death
Follow us on

జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలనే లక్ష్యంతో విదేశానికి వెళ్లాడు. అక్కడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సాధించాడు. ఆనందంగా సాగిపోతున్న సమయంలో ఆ యువకుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. మరోసారి ఆపరేషన్ చేయాలని సూచించారు. వ్యాయామం కోసం స్విమ్మింగ్ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో జారి పడిపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లిన యువకుడు.. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం, కరోనా వంటి కారణాలతో తల్లిదండ్రులను కలుసుకోలేకపోయాడు. శస్త్ర చికిత్స ఉన్నందున ఏప్రిల్‌2న అతని తల్లిదండ్రులు ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో ఈ దుర్ఘటన జరగడం వారి కుటుంబలో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్(Hyderabad) నగరంలోని రెజిమెంటల్‌బజార్‌(Rezimental Bazar) కు చెందిన శ్రీనివాస్‌, అరుణ దంపతులకు కుమారుడు సాయి సూర్యతేజ. ఆతను నగరంలో బీటెక్‌ పూర్తి చేసి ఎంఎస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. చదువు పూర్తయిన అనంతరం అక్కడే సివిల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు.

ఈ క్రమంలో ఈనెల 7న బ్రిస్బేన్‌లో తానుండే అపార్టుమెంట్‌ కింద స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాడు. రెయిలింగ్‌ పట్టుకుని.. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయాడు. ఊపిరాడకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న సూర్యతేజ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. కొద్దిసేపటి క్రితమే తమతో ఫోన్ లో మాట్లాడానని, అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని విలపించారు. 2019లో ఆస్ట్రేలియాకు వెళ్లిన సూర్యతేజ.. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం, కరోనా వంటి కారణాలతో తల్లిదండ్రులను కలుసుకోలేకపోయాడు. శస్త్ర చికిత్స ఉన్నందున ఏప్రిల్‌2న సూర్యతేజ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకున్నారు. కుమారుడికి ఇష్టమైన వస్తువులు, దుస్తులు కొన్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఆస్ట్రేలియాలోనే అతని స్నేహితులు, తెలుగు సంఘాలు సాయి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read

Radhe Shyam: ఆర్టీసీ బస్సే క్షేమం అంటోన్న రాధేశ్యామ్‌.. సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న సజ్జనార్‌ పోస్ట్‌..

Rashmika Mandanna: సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించిన శ్రీవల్లి.. ఆ విషయం గురించి మాత్రం చెప్పనంటూ..

ABHA Health Card: రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా.. కేంద్రం అందిస్తున్న ABHA హెల్త్ కార్డును ఎలా పొందాలంటే..