World’s Largest Iceberg: సముద్రంలో విరిగిపడిన అతిపెద్ద మంచుకొండ.. ప్రపంచంలో..

| Edited By: Ram Naramaneni

May 21, 2021 | 9:24 AM

Largest Iceberg Breaks: ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ ఎ-76 విరిగిపోయి సముద్రంలో పడిపోయింది. అంటార్కిటికాకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న రోనీ

Worlds Largest Iceberg: సముద్రంలో విరిగిపడిన అతిపెద్ద మంచుకొండ.. ప్రపంచంలో..
World's Largest Iceberg Breaks
Follow us on

Largest Iceberg Breaks: ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ ఎ-76 విరిగిపోయి సముద్రంలో పడిపోయింది. అంటార్కిటికాకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న రోనీ ఐస్ షెల్ఫ్ నుంచి ఈ భారీ ఐస్‌బర్గ్ బ్రేక్ అయినట్లు యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. 170 కిలో మీటర్ల పొడవు, 25 కిలీమీటర్ల వెడల్పుతో ఉండే ఈ ఐస్‌బర్గ్ ఢిల్లీ వైశాల్యానికి దాదాపు మూడు రెట్లు పెద్దదిగా ఉంటుంది. చేతి వేలు ఆకారంలో ఉండే ఈ ఐస్‌బర్గ్ వెడల్ సీ నీటిపై స్వేచ్ఛగా తేలుతూ ప్రవహించింది.

1484 చదరపు మైళ్ల వైశాల్యం కలిగిన ఈ ఐస్‌బర్గ్ పేరు ఎ-76. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ మంచుకొండగా గుర్తించారు. వెడల్ సీలో ప్రవహిస్తున్న ఈ భారీ ఐస్‌బర్గ్‌ను శాటిలైట్ ద్వారా గుర్తించినట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇటీవల కాలంలో మంచు కొండలు భారీగా విరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో తలెత్తబోయే విపత్తులకు ఇవి ముందస్తు హెచ్చరికలంటూ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Also Read:

కోవిద్ తో తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ. 1500 సాయం, పంజాబ్ ప్రభుత్వ ప్రకటన, 21 ఏళ్ళ వరకు వెసులుబాటు

Israel Palestine Crisis: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. ఎందుకంటే..!