AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce rate: విడాకులకు దూరంగా మనోళ్లే టాప్.. తాజా సర్వేలో సంచలన విషయాలు..

పెళ్లి చేసుకోవడం భారతదేశంలో సదాచారం. అయితే సంసారాన్ని కడవరకూ నెట్టుకురావడం సాగరం ఈదినంత కష్టమైన విషయమే. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు అనేక ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇలాంటి దంపతీ వ్యవస్థ అత్యంత కష్టతరమైనప్పటికీ మనోళ్లు వైవాహిక సంబంధాలను కాపాడుకోవడంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.

Divorce rate: విడాకులకు దూరంగా మనోళ్లే టాప్.. తాజా సర్వేలో సంచలన విషయాలు..
World's Highest Divorce Rate
Srikar T
|

Updated on: Jan 31, 2024 | 6:38 PM

Share

పెళ్లి చేసుకోవడం భారతదేశంలో సదాచారం. అయితే సంసారాన్ని కడవరకూ నెట్టుకురావడం సాగరం ఈదినంత కష్టమైన విషయమే. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు అనేక ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇలాంటి దంపతీ వ్యవస్థ అత్యంత కష్టతరమైనప్పటికీ మనోళ్లు వైవాహిక సంబంధాలను కాపాడుకోవడంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా వెల్లడించిన గ్లోబల్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటులో మనదేశం తక్కువగా ఉంది. భారతదేశంలో విడాకుల రేటు కేవలం 1 శాతం మాత్రమే నమోదైనట్లు ఈ నివేదిక సారాంశం.

భారతదేశం తర్వాత, వియత్నాం రెండవ అత్యల్ప విడాకుల రేటు 7 శాతంగా పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక విడాకుల రేటును పోర్చుగల్‌లో నమోదు చేసింది. ఈ దేశంలో 94శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు ఈ సర్వే పేర్కొంది. ఇక ఖండాల పరంగా, యూరప్ అత్యధిక విడాకుల రేటును నమోదు చేస్తుంది. పోర్చుగల్ తర్వాత స్పెయిన్‎లో విడాకుల రేటు 85 శాతంగా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

లక్సెంబర్గ్, ఫిన్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, స్వీడన్‌తో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా విడాకుల రేటును 50 శాతానికి మించి నమోదు చేశాయి. యునైటెడ్ స్టేట్స్ 45శాతం, కెనడా 47శాతంతో దగ్గరగా కొనసాగుతున్నాయి. ఇక డెన్మార్క్, సౌత్ కొరియా దేశాలు కూడా 46శాతం విడాకుల రేటును కొనసాగిస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‎లు 40 శాతానికి మించి విడాకుల రేటును కొనసాగిస్తోంది. జపాన్, జర్మనీ, కొలంబియా, పోలాండ్‎లు 30శాతానికి పైగా తమ వైవాహిక జీవితాన్ని దూరంగా ఉండేందుక ప్రయత్నిస్తున్నాయి. 10 శాతం నుంచి 20 శాతం మధ్య విడాకుల రేటును చిన్న చిన్న దేశాలైన ఇరాన్, మెక్సికో, ఈజిప్ట్ దేశాలు కొనసాగిస్తున్నాయి.

భారతదేశంలో విడాకులు అనేది జంటలకు పెద్ద సవాలుతో కూడిన ప్రయాణం. ఒకరి మతాన్ని బట్టి చట్టంలోని రూల్స్ మారుతూ ఉంటాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కుల కోసం విడాకుల ప్రక్రియను హిందూ వివాహ చట్టం1955 ద్వారా నిర్వహిస్తున్నారు. అలాగే ముస్లింలు 1939 నాటి ముస్లిం వివాహ రద్దు చట్టానికి కొనసాగిస్తున్నారు. పార్సీలకు, 1936 నాటి పార్సీ వివాహం, విడాకుల చట్టం వర్తిస్తుంది. క్రైస్తవులు మాత్రం1869 నాటి భారతీయ విడాకుల చట్టాన్ని ఫాలోఅవుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..