వజ్రాల ప్రేమికుల మనసు మరోసారి దోచుకుంది పర్పుల్-పింక్ డైమండ్. ‘సాకురా’ను వేలం వేసినవారే ఆశ్చర్య పోయారు. ఆ స్థాయిలో అది ధరను పలికింది. చరిత్రలో మొదటి సారి ఈ స్థాయిలో భారీ ధర పలకడం. వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ.213 కోట్లు పలికింది. వేలం పాటలో వజ్రాలకు అత్యధిక డిమాండ్ రావడం మనం ఇంత వరకు చూస్తున్నాం. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్ ‘ది సాకురా’ను హాంగ్‌కాంగ్‌లో ఓ జూవలరీ సంస్థ అమ్మకానికి పెట్టింది. సాకురా అంటే “వికసించే చెర్రీ” అని జపనీస్ పదం. అంతే కాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా రికార్డుల్లో ఎక్కింది.
వేలం వేయగా రూ. 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్‌ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే పేరు మాత్రం ప్రకటించలేదు. ‘ది సాకురా’తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్ డాకర్లకు ‘ది స్వీట్ హార్ట్’ పేరుతో వేలం వేశారు. కాగా ‘ది సాకురా’ పింక్ డైమండ్ 29.3 మిలియన్ డాలర్లు పలికింది.
#AuctionUpdate The Sakura, a 15.81 Carat Fancy Vivid Purple Pink Internally Flawless Type lla Diamond Ring, realized HK$226,275,000 / US$29,285,318 and set a new auction record for the largest Purple Pink flawless diamond ever sold at auction. pic.twitter.com/4BbkQ6k0hU
— Christie’s (@ChristiesInc) May 23, 2021
కాగా దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ..”ఈ రోజు ఆభరణాల వేలం చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని ‘‘ది సాకురా’’ నమోదు చేసింది. వేలంలో రికార్డ్ స్థాయిలో పలికిన ధర పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే అత్యుత్తమ పింక్ వజ్రాలను అందించే క్రిస్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం.” అని తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
జెనీవాలో గత నవంబర్‌లో ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్ ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం “ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్” 23-38 మిల్లియన్ డాలర్లు పలికినట్లు అంచనా.