World Covid 19 updates: ప్రపంచవ్యాప్తంగా క్రమంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే…

|

Feb 02, 2021 | 12:37 PM

ప్రపంచ దేశాలను ఏడాది నుంచి గజగజా వణికించిన కరోనా వైరస్ నుంచి త్వరలోనే దేశాలు బయటపడే సూచనలు కన్పిస్తున్నాయి. గత నెలనుంచి క్రమంగా కొత్త కేసుల నమోదు...

World Covid 19 updates: ప్రపంచవ్యాప్తంగా క్రమంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...
Follow us on

World Covid 19 updates: ప్రపంచ దేశాలను ఏడాది నుంచి గజగజా వణికించిన కరోనా వైరస్ నుంచి త్వరలోనే దేశాలు బయటపడే సూచనలు కన్పిస్తున్నాయి. గత నెలనుంచి క్రమంగా కొత్త కేసుల నమోదు తగ్గుతుంది..  గత వారం రోజుల నుంచి కరోనా కొత్త కేసుల జోరు తగ్గింది. ఇక మరణాలు కూడా క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. గత 24గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 3,10,870 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 10,39,34,810లకు చేరుకుంది. 2 వారాల కిందట ఈ సంఖ్య డబుల్ ఉండేది. ఇక గడచిన 24గంటల్లో 7,400 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 22,47,755 చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా 7,57,50,657మంది కోలుకున్నారు. మొత్తం మీద కోవిడ్ ఉధృతి తగ్గిందని.. దీనికి కారణం ఓ వైపు వాతావరణంలోని మార్పులు.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ అని వైద్య నిపుణులు చెప్పారు.

ఇక అగ్రరాజ్యం అమెరికాలో గత 24 గంటల్లో 5,934 పాజిటివ్ కేసులు నమోద్యయాయి. మొత్తం కేసులు 2.68 కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,194 మంది చనిపోవడంతో… మొత్తం మరణాలు 4.53 లక్షలు దాటాయి. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరోవైపు పెరూ దేశంలో సెకండ్ వేవ్ సాగుతుంది. దీంతో అక్కడ ప్రజలు ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా సోకినా బాధితులకు తీవ్ర శ్వాస కోస వ్యాధు ఉన్నట్లు అయితే వారికి ఆక్సిజ‌న్ త‌ప్ప‌నిస‌రి. దీంతో ఆక్సిజ‌న్ కోసం దేశ‌వ్యాప్తంగా జ‌నం సిలిండ‌ర్ల సెంట‌ర్ల వ‌ద్ద ఎదురుచూస్తున్నారు.

Also Read:

రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

దేశంలో కొత్తగా 13,423 రికవరీలు.. గత 24గంటల్లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?