AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ మూలాలను కనుగొనే నిపుణులపై అనుమానాలా ? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం

కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న నిపుణుల బృందం ఇన్వెస్టిగేషన్ అనుమానాస్పదంగా ఉందంటూ కొందరు విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై...

కోవిడ్ మూలాలను కనుగొనే నిపుణులపై అనుమానాలా ? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 02, 2021 | 12:14 PM

Share

కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న నిపుణుల బృందం ఇన్వెస్టిగేషన్ అనుమానాస్పదంగా ఉందంటూ కొందరు విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి కన్నా మీ వద్ద మరింత మెరుగైన సమాచారం ఉంటే దాన్ని తెలిపేందుకు ముందుకు రావాలని ఈ సంస్థ ఎమెర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ కోరారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలాంటివారు తెరవెనుక నుంచి ముందుకు వఛ్చి తమకు అందిన సమాచారాన్ని షేర్ చేసుకోవాలన్నారు. కోవిడ్ ఆరిజిన్ ని కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సుమారు 12 మంది నిపుణులు ప్రస్తుతం చైనాలోని వూహాన్ సిటీలో పర్యటిస్తున్నారు. అక్కడి సీ ఫుడ్ మార్కెట్ ని వారు ఇటీవల సందర్శించారు. ఈ మార్కెట్ లోని జంతువులు,  సీ ఫుడ్ నుంచి ఈ వైరస్ మనుషులకు సోకిందని వార్తలు వఛ్చిన నేపథ్యంలో వారు చైనా శాస్త్రజ్ఞులతో దీనిపై చర్చిస్తున్నారు.

కానీ ఈ నిపుణులకన్నా ముందే తమకు కరోనా వైరస్ పుట్టుక గురించి తెలుసునంటూ కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారని ర్యాన్ అన్నారు. నిపుణులు విడుదల చేసే నివేదికను తాము అంగీకరించబోమని వీరు అంటున్నారని, అసలు నివేదిక ఇంకా బయటికి రానిదే ఇలా ఎలా వ్యాఖ్యానిస్తారని ఆయన ప్రశ్నించారు. మీకు ఏయే సంస్థలనుంచి ఈ సమాచారం లభించిందో తెలియజేస్తే మరీ సంతోషం అని ర్యాన్ పేర్కొన్నారు.

మరిన్ని చదవండి:అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి.. చివరి చూపు కల్పించాలంటూ కుటుంబసభ్యులు ఆవేదన..

మరిన్ని చదవండి:విషాదం : ప్రభుత్వ గోశాలలో 78 ఆవులు మృత్యువాత, ‘గోపష్టమి’ ముందు రోజే ఇలా !

Follow Us
నోట్లో వెన్నలా కరిగిపోయే వంకాయ ఫ్రై.. 2 ముద్దలు ఎక్కువే తింటారు!
నోట్లో వెన్నలా కరిగిపోయే వంకాయ ఫ్రై.. 2 ముద్దలు ఎక్కువే తింటారు!
100 కిలోల రాయిని ఒక చిన్న చీమతో పైకెత్తాలి.. ఎలా? చిక్కుప్రశ్న
100 కిలోల రాయిని ఒక చిన్న చీమతో పైకెత్తాలి.. ఎలా? చిక్కుప్రశ్న
నిద్రపోయేటప్పుడు ఈ 4 వస్తువులను దిండు కింద పెట్టుకుంటున్నారా?
నిద్రపోయేటప్పుడు ఈ 4 వస్తువులను దిండు కింద పెట్టుకుంటున్నారా?
కనకాంబరం సాగుతో రైతుకు మంచి ఆదాయం..
కనకాంబరం సాగుతో రైతుకు మంచి ఆదాయం..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పార్సిల్ బుకింగ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పార్సిల్ బుకింగ్..
ఇది జస్ట్ శాంపిల్.. వైభవ్‌ని కెలికితే ఊరుకుంటునా..!
ఇది జస్ట్ శాంపిల్.. వైభవ్‌ని కెలికితే ఊరుకుంటునా..!
మహాలక్ష్మి రాజయోగం.. దీపావళికి ముందే ఈ 4 రాశుల వారికి అదృష్టం..
మహాలక్ష్మి రాజయోగం.. దీపావళికి ముందే ఈ 4 రాశుల వారికి అదృష్టం..
నవ్వుతూ అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి.. కొద్దిసేపటికే ఊహించని..
నవ్వుతూ అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి.. కొద్దిసేపటికే ఊహించని..
ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే..
ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే..
అదృష్టం ఉన్నా.. పండుగ తర్వాత ఈ రాశి వారికి కష్టాలే కష్టాలు!
అదృష్టం ఉన్నా.. పండుగ తర్వాత ఈ రాశి వారికి కష్టాలే కష్టాలు!