Trending: వరంగా మారిన భార్య ఇచ్చిన గిఫ్ట్.. ఆ బహుమతే అతడి పాలిట వరమైంది.. లేకుంటే
వివాహబంధం (Marriage) ఎంతో పవిత్రమైనది. రెండు మనసులను ఒక్కటి చేసే అపురూప ఘట్టం. సంసార జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఎదుర్కొంటూ ఒకరికొకరు తోడుగా జీవితాంతం కొనసాగించే అద్భుత...
వివాహబంధం (Marriage) ఎంతో పవిత్రమైనది. రెండు మనసులను ఒక్కటి చేసే అపురూప ఘట్టం. సంసార జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఎదుర్కొంటూ ఒకరికొకరు తోడుగా జీవితాంతం కొనసాగించే అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒక్కోసారి ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలూ జరుగుతంటాయి. అయితే వాటిని సమర్థంగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ఏ కష్టం లేకుండా జీవితం ఆనందకరంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఆలూమగలకు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ వారి పాలిట వరంగా మారుతుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. యూకేకు (UK) చెందిన డేవిడ్ లాస్ట్ అనే వ్యక్తికి బర్త్ డే గిఫ్ట్ గా అతని భార్య యాపిల్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చింది. హార్ట్ బీట్ వేగమైతే హెచ్చరించడం దీని ప్రత్యేకత. కొద్ది రోజుల క్రితం యాపిల్ వాచ్ ధరించిన డేవిడ్ కు సెన్సార్ వార్నింగ్ ఇచ్చింది. దాదాపు 3,000 సందర్బాల్లో తక్కువ హృదయ స్పందన ఉన్నట్టు గుర్తించింది.
వెంటనే అప్రత్తమైన దంపతులిద్దరూ వైద్యుడిని సంప్రదించారు. డేవిడ్ ను ఎగ్జామిన్ చేసిన డాక్టర్లు 48 గంటల పాటు వివిధ రకాల పరీక్షలు చేశారు. ఆ సమయంలో 138 సార్లు అతని గుండె ఆగిపోయే స్థితికి వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన డాక్టర్లు గుండెలో పెద్ద బ్లాక్ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీనికి అంగీకరించిన డేవిడ్ సర్జరీ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేసి పేస్ మేకర్‌ను అమర్చారు. అలా తన భార్య ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ అతని పాలిట వరంగా మారింది. తన ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్‌ను ఎప్పటికీ తనతోనే ఉంచుకుంటానంటూ డేవిడ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్య లేకుంటే ప్రాణాలు దక్కేవి కావని కంటతడి పెట్టాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..