Omicron: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా తేరుకోకముందే కొత్త వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీంతో ఈ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి అందరిలో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఇక ఈ వేరియంట్ భారత్‌లో కూడా వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు ఈ ఒమిక్రాన్ 38 దేశాలకు వ్యాపించింది. బెంగళూరులో రెండు కేసులు నమోదు కాగా, తాజాగా మరో కేసు నమోదు కావడంతో మూడుకు చేరింది. దీంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ వేరియంట్ వివరాలు..
► నవంబర్ 9న దక్షిణాఫ్రికాలో తొలి కేసు నమోదు
► దీనిని డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు.
► నవంబరు24న డబ్ల్యూహెచ్‌వో (WHO) అధికారిక ప్రకటన
► అత్యంత వేగంగా విస్తరించే వేరియంట్
► 3 రోజుల్లో 24 దేశాల్లో వ్యాప్తి
► భారత్‌లో 2 కేసులు
ఒమిక్రాన్ ప్రమాదమా?
► ఇమ్యునిటీని తట్టుకునే సామర్థ్యం
► 50 మ్యుటేషన్లతో 500 రెట్లు వ్యాప్తి
► వ్యాక్సిన్ పనిచేయదన్న WHO
► యాంటీ బాడీ ట్రీట్‌మెంట్ పనిచేయదు
► కరోనాకు వాడిన మందుల పనిచేస్తాయో లేదో?
► కరోనా వచ్చి తగ్గినవారిపై అధిక ప్రభావం
ఉపశమనం
► స్వల్పంగానే లక్షణాలు
► ఒళ్లు నొప్పులు, అలసట, జ్వరం
► తీవ్ర అనారోగ్యం కనిపించలేదు
► ఆసుపత్రికి వెళ్లకుండానే ఎక్కువమంది రికవరీ
► ఇప్పటివరకూ డెత్ రిపోర్ట్ లేదు
► దీనిపై అంచనాకు సమయం పడుతుంది
అలర్ట్
► థర్డ్‌వేవ్‌పై డబ్ల్యూహెచ్‌వో అలర్ట్
► మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పనిసరి
► కరోనా టెస్టులు పెంచడం
► ప్రయాణాలపై ఆంక్షలు, కంటైన్‌మెంట్ జోన్లు
► ప్రత్యేకంగా ఆసుపత్రులు
►అవసరం అయితే లాక్‌డౌన్
అమెరికాలో..
అమెరికాలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయట పడటంతో అధ్యక్షుడు జో బైడెన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. వచ్చేవారం నుంచి ఇతర దేశాల నుంచి అమెరికాలో అడుగుపెట్టేవారు 24 గంటలలోపు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, అది కూడా నెగిటివ్ రిపోర్టుతో రావాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. ఇతర దేశాల నుంచి అమెరికన్లకూ ఈ నిబంధన వర్తింపు. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినవారు కూడా టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అమెరికాకు రావాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. తాజాగా కరోనా బారినపడి కోలుకున్నవారైతే సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అలాగే విమానాలు, రైళ్లు, బస్సులలో మాస్కు తప్పనిసరి. మార్చి వరకు ఈ నిబంధన అమలులో ఉంటాయి. ఇప్పటివరకు అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 10 నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలిఫోర్నియా, కొలరాడో, మిన్నెసోటా, న్యూయార్క్, హవాయిలో కేసుల నమోదయ్యాయి. వీరిలో హవాయికి చెందిన వ్యక్తి ఎక్కడికీ ప్రయాణాలు చేయలేదు.. అయినా ఒమిక్రాన్ వేరియంట్ కనిపించిందని అధికారులు చెబుతున్నారు.
అయితే న్యూయార్క్‌లో కోవిడ్ టెస్ట్‌లు చేయించుకుంటున్న ప్రజలు.. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా బారినపడిన వారంతా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకుపైగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రత ఎంత ఉంటుందనే పై ఇంకా ఎలా స్పష్టత రాలేదు. కానీ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చలికాలంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తుండగా, అర్హులంతా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని అమెరికా ప్రభుత్వం సూచిస్తోంది. అమెరికా, మరికొన్ని దేశాలు ఆఫ్రికా ఖండంలోని 8 దక్షిణ దేశాలకు రాకపోకలు నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి: