Sniper Wali: ఒకే ఒక్కడు.. రష్యాకు సుస్సు పోయిస్తున్నాడు.. వచ్చీ రావడంతోనే ఊచకోత..

|

Mar 12, 2022 | 4:29 PM

Russia Ukraine Crisis: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. మూడు సార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో రష్యా దాడులను ముమ్మరం చేసింది. అయితే.. రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతోంది.

Sniper Wali: ఒకే ఒక్కడు.. రష్యాకు సుస్సు పోయిస్తున్నాడు.. వచ్చీ రావడంతోనే ఊచకోత..
Wali
Follow us on

Russia Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. మూడు సార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో రష్యా దాడులను ముమ్మరం చేసింది. అయితే.. రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతోంది. అయితే.. రష్యాపై పోరుడుతున్న ఉక్రెయిన్ కోసం చాలామంది యుద్ధంలో పాల్గొంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు.. వేరే దేశాలకు చెందిన వారు సైతం యుద్ధంలో పాల్గొంటూ రష్యాను దాడులను తిప్పికొడుతున్నారు. అయితే.. ఈ యుద్ధంలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్‌లలో ఒకడైన వాలి.. ఉక్రెయిన్ తరఫున రంగంలోకి దిగాడు. జెలెన్‌స్కీ పిలుపుమేరకు బుధవారం వచ్చిన వలి.. రెండు రోజుల్లోనే ఆరుగురు రష్యా సైనికుల్ని చంపేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్నిపర్‌గా గుర్తింపు పొందిన మాజీ కెనడియన్ సైనికుడు ఇప్పుడు రష్యా ఆటకట్టించేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరి.. మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. రాయల్ కెనడియన్ 22వ రెజిమెంట్‌కు చెందిన అనుభవజ్ఞుడైన వాలీ, రష్యాకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటున్నాడు.

వలి ఎవరంటే..?

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన స్నిపర్. అతను రోజున 40 మందిని చంపగలడు. వలీ 2009, 2011లో కెనడియన్ సాయుధ దళాల తరుఫున ‘ప్రాణాంతకమైన’ స్నిపర్‌గా ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు సార్లు పనిచేశాడు. దీంతోపాటు సిరియా, ఇరాక్‌లలో సైతం పని చేశాడు. ఆ బెటాలియన్‌లో అతను 3.5 కి.మీ. కిల్ దూరంలోని లక్ష్యాన్ని చేధించి శత్రువులను చంపగలడు. వలి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న సమస్యంలో అరబిక్‌లో రక్షకుడు అని అర్థం వచ్చే వాలీ అనే పేరును సంపాదించాడు. అత్యంత దూరం నుంచి ఐసిస్ ఉగ్రవాదులను చంపిన షూటర్‌గా పేరు సంపాదించాడు.

జెలెన్‌స్కీ పిలుపు మేరకు భార్య, ఏడాది కూడా నిండని కుమారుడిని వదిలేసి.. వలి ఈ యుద్ధంలో పాల్గొంటున్నాడు. వచ్చేవారం అతని కుమారుడి మొదటి పుట్టిన రోజు జరగనుంది. కానీ ఈ సమయంలో ఉక్రెయిన్‌ ప్రజలకు తన సహాయం అవసరమని వచ్చినట్లు వలి పేర్కొన్నాడు. ఐరోపా వాసులుగా ఉండాలనుకుంటున్నారు. రష్యన్‌గా ఉండకూడదని అనుకోవడం వల్ల బాంబు దాడులకు గురవుతున్నారు.. అంటూ ఇటీవల బీబీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తాను ఇక్కడికి వచ్చినప్పు ఉక్రేయిన్ వారు స్వాగతం పలికారంటూ పేర్కొన్నాడు వలీ.. ఇక్కడ వారంతా స్నేహితులయ్యారంటూ తెలిపాడు.

Also Read:

Russia Ukraine Crisis: అలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. అమెరికా అధ్యక్షుడి నోట ఆసక్తికర వ్యాఖ్యలు..

Russia Ukraine War Updates: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సమీపిస్తున్న రష్యా సేనలు.. టాప్-9 న్యూస్ అప్‌డేట్స్