WHO: ఆందోళన కంటే అవగాహనే ముఖ్యం.. మంకీపాక్స్ వ్యాప్తి పట్ల డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన

|

Jun 06, 2022 | 12:48 PM

కరోనాతో అల్లకల్లోలమైన ప్రపంచంపై మరో వైరస్ ప్రతాపం చూపిస్తోంది. పలు దేశాల్లో వేగంగా వాప్తి చెందుతున్న మంకీపాక్స్ కలవరపెడుతోంది. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి...

WHO: ఆందోళన కంటే అవగాహనే ముఖ్యం.. మంకీపాక్స్ వ్యాప్తి పట్ల డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన
Monkeypox
Follow us on

కరోనాతో అల్లకల్లోలమైన ప్రపంచంపై మరో వైరస్ ప్రతాపం చూపిస్తోంది. పలు దేశాల్లో వేగంగా వాప్తి చెందుతున్న మంకీపాక్స్ కలవరపెడుతోంది. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంకీపాక్స్ వైరస్(Monkeypox) నివారణ చర్యలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో(WHO) అధికారిణి మరియా వాన్ కెర్‌ఖోవ్ అన్నారు. ప్రధానంగా మంకీపాక్స్‌ గురించి అవగాహన లేని దేశాల్లో సకాలంలో గుర్తించేలా, సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైరస్‌ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించాలని ఆమె అన్నారు. ఇందుకు గాను అంతర్జాతీయ నిపుణులు, పరిశోధన సంస్థలతో త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం మనం వైద్య సదుపాయాల ఆధారంగా వైరస్‌ను ముందుగానే గుర్తించగలుగుతున్నాం. అనుమానితులతో పాటు వారిని కలిసినవారినీ ఐసొలేషన్‌ చేయాలి. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేవారు, పరీక్షలు చేసేవారు, సేవలు అందించేవారు ఈ వైరస్‌కు గురించి కనీస అవగాహన ఉండాలి. ఈ వైరల్‌ వ్యాధి చికిత్స కోసం అవసరమైన అన్ని పద్ధతులను అవలంబించాలి. ఇందుకోసం కొన్ని యాంటీవైరల్స్‌, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

 – డబ్ల్యూహెచ్ఓ

ఇవి కూడా చదవండి

గతంలోనూ వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌ కరోనా అంత ప్రమాదకారి కాదని వెల్లడించింది. ఈ వైరస్‌ ను నివారించేందుకు అవసరమైన టీకాలు ఏయే దేశాల వద్ద ఎన్ని ఉన్నాయో పూర్తి సమాచారం లేదని తెలిపింది. వైరస్ వ్యాప్తిపై దృష్టి సారిస్తే నివారించడం అంత కష్టమేమీ కాదని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి