Chicken Blood Parenting: చైనాలో కొత్త ట్రెండ్‌.. ఇది పెద్ద ప్రమాదమంటున్న నిపుణులు.. అదేంటంటే..!

Chicken Blood Parenting: ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగంలో కానీ.. వ్యాపారంలో కానీ.. నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు సక్సెస్‌..

Chicken Blood Parenting: చైనాలో కొత్త ట్రెండ్‌.. ఇది పెద్ద ప్రమాదమంటున్న నిపుణులు.. అదేంటంటే..!
Chicken Blood’ Parenting

Chicken Blood Parenting: ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగంలో కానీ.. వ్యాపారంలో కానీ.. నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు సక్సెస్‌ అయినట్లు. ఈ ఉద్దేశంతోనే చాలామంది కష్టపడి పనిచేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు చైనా ఇదే ధోరణి అవలంబిస్తోంది. తమ పిల్లలు ప్రపంచంతో పోటీ పడి జగజ్జేతలుగా నిలవాలని ఆశ పడుతోంది. చదువు, ఆటలు, కళలు.. అన్ని రంగాల్లో తమ పిల్లలు ముందుండాలని భావిస్తోంది. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయమాలు, తదితర జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో వైరల్‌ను తట్టుకునే శక్తి పిల్లలకు ఉండదు. అందుకే మంచి ఆహారం తీసుకోవడం, పిల్లలకు వ్యాయమాలు నేర్పంచడం వంటివి చేస్తే ఎంతో మేలు. లేనిపోని వాటికి అలవాటు పడితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే అక్కడి తల్లిదండ్రులు పిల్లలకు రోజుకు 14 గంటలు శిక్షణ ఇస్తున్నారు. పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. వారి చదువుకోసం పాఠశాల దగ్గరలోనే ఇల్లు కొనడం, అద్దెకు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు సెలవు పెట్టిమరీ తమ పిల్లల్లోని ప్రతిభను వెలికితీస్తున్నారు. ఇక ‘చికెన్ బ్లడ్ పేరెంటింగ్’ పేరుతో ఓ కొత్త పద్దతిని తీసుకొచ్చి పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు తల్లిదండ్రులు.

చికెన్ బ్లడ్ పేరెంటింగ్ అంటే ఏంటి?

పూర్వకాలంలో వివిధ రోగాలతో బాధపడుతున్న వారికి అప్పుడే చంపిన కోడి రక్తం తాగించేవారట. ఆలా చేస్తే వారు వ్యాధి నుంచి కోలుకుంటారని చైనీయులు ప్రగాఢంగా నమ్మేవారు. బట్టతల కూడా పోతుందని విశ్వసించేవారు. అప్పుడే చంపిన కోడి రక్తం తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారి నమ్మకం. కోడి రక్తంతో కూడుకున్న చికిత్స కావడంతో దీనికి ‘చికెన్‌ బ్లడ్ ట్రీట్మెంట్’ అనేవారు. తమ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలని అక్కడి తల్లిదండ్రులు ఈ విధానం అనుసరించేవారు. అందుకే దీనికి ‘చికెన్ బ్లడ్ పేరెంటింగ్’ అని పేరు పెట్టారు.

వైద్య నిపుణుల అసహానం..

అయితే చైనా తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై నిపుణులు, వైద్యులు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను నిర్బంధిస్తూ, పుస్తకాలతో కుస్తీ పట్టించడం వల్ల అనేక అనర్ధాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా చిన్నపిల్లల్లో కంటి సమస్యలు తలెత్తుతున్నాయని సూచిస్తున్నారు. 81 శాతం మంది పిల్లలకు కంటి చూపు తగ్గిందని చైనాలోని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. ఇది చాలా ప్రమాదకర విషయమని హెచ్చరించింది. ఇక టీనేజర్లలో 25 శాతం మంది డిప్రెషన్‌లోకి, 7.4 శాతం మంది కోలుకోలేని నిరాశలోకి వెళ్లినట్టు వైద్యులు తెలిపారు. ఇలాంటి విధానం అవలంబించడం వల్ల మరింత నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Cooking Oil: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వంట నూనె దిగుమతి సుంకంలో కోత.. దిగి రానున్న ధరలు

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం

Blood Pressure: మీకు అధిక రక్తపోటు ఉందా..? ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే అదుపులో ఉంటుంది

Click on your DTH Provider to Add TV9 Telugu