West Nile Virus: ప్రాణాంతక వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి.. అధికారుల నిర్లక్ష్యం అంటూ సెవిల్లే నివాసితులు నిరసన

|

Sep 03, 2024 | 2:30 PM

సమస్త మానవాళిపై వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది మొదలు.. గత నాలుగేల్ల నుంచి ఒక వైరస్ తర్వాత ఒకటి మేమున్నామంటూ మళ్ళీ వెలుగులోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రకరకాల వైరస్ లు సోకి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ సృష్టించిన విద్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని ఇప్పుడు రెండు వైరస్ లు వణికిస్తున్నాయి. అయితే స్పానిష్ లో వెస్ట్ నైల్ వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు నిరసన చేశారు.

West Nile Virus: ప్రాణాంతక వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి.. అధికారుల నిర్లక్ష్యం అంటూ సెవిల్లే నివాసితులు నిరసన
West Nile Virus
Follow us on

సమస్త మానవాళిపై వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది మొదలు.. గత నాలుగేల్ల నుంచి ఒక వైరస్ తర్వాత ఒకటి మేమున్నామంటూ మళ్ళీ వెలుగులోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రకరకాల వైరస్ లు సోకి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ సృష్టించిన విద్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని ఇప్పుడు రెండు వైరస్ లు వణికిస్తున్నాయి. అయితే స్పానిష్ లో వెస్ట్ నైల్ వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు నిరసన చేశారు. ఈ వేసవిలో దక్షిణ స్పానిష్ ప్రావిన్స్‌లో ఐదుగురు ప్రాణాలను బలిగొన్న వెస్ట్ నైల్ వైరస్‌ నివారణ కోసం బలమైన చర్య తీసుకోవాలని సెవిల్లెలోని నివాసితులు నిరసనను నిర్వహించారు. ఈ వెస్ట్ నైల్ వైరస్ (WNV) సాధారణంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఉన్న పక్షులను దోమలు కుట్టిన తర్వాత ఆ దోమ మనుషులకు కుడితే ఈ వ్యాధి మానవులకు వ్యాపిస్తుంది. చాలా అరుదుగా ఈ వైరస్ రక్తమార్పిడి, అవయవ మార్పిడి లేదా గర్భం, ప్రసవం లేదా తల్లిపాలు ఇచ్చే సమయంలో తల్లి నుండి బిడ్డకు వ్యాపిస్తుంది, అయితే ఇది నేరుగా ఒకరి నుంచి మరొకరి వ్యాపించదు.

సెవిల్లె సమీపంలోని దిగువ గ్వాడల్‌క్వివిర్ వ్యాలీ ప్రాంతం మరణించిన వారితో సహా మొత్తం 61 ఈ వెస్ట్ నైల్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఈ వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి అనూహ్యంగా తీవ్రంగా ఉంది. 2020 తర్వాత రెండవ అత్యధిక వైరస్ బాధితులు నమోదయ్యారు. 76 వెస్ట్ నైల్ వైరస్ కేసులు నమోదు కాగా ఎనిమిది మంది మరణించినట్లు BBC నివేదిక తెలిపింది.

నైల్ వైరస్‌ అరికట్టేందుకు మరింత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం సెవిల్లేలోని ఇస్లా మేయర్‌లో నిరసన ప్రదర్శన జరిగింది. నైల్ వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటూ నినదించారు. ఈ వైరస్‌ను విజృంభించకుండా అధికారులు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని కోరారు. ప్రజల నిరసనపై అండలూసియన్ ప్రాంతీయ ప్రభుత్వం స్పందిస్తూ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి ప్రావిన్సులు, మునిసిపాలిటీల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తామని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ వేసవిలో నైలు వైరస్ బారిన పడిన 86 ఏళ్ల వృద్ధురాలు గ్రెనడా రొమెరో రూయిజ్ బంధువులు స్థానిక అధికారులపై తమ ఆగ్రహం వ్యాప్తం చేస్తూ అధికారుల పనీరుపై నిరాశను వ్యక్తం చేశారు. సమీపంలోని వరి పొలాల్లో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోని అధికారులను ఈ వైరస్ వ్యాప్తికి బాధ్యులుగా ప్రజలు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిలో అధికారులు పాత్ర పోషించించారని ఆరోపిస్తున్నారు.

గ్వాడల్‌క్వివిర్ లోయలోని విస్తారమైన చిత్తడి నేలలు, వరి పొలాలు దోమలకు అనువైన సంతానోత్పత్తి స్థలాలని కనుక ఇక్కడ దోమలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే దోమలు.. వెస్ట్ నైల్ వైరస్‌ను పక్షుల నుంచి మానవులకు, యు ఇతర క్షీరదాలకు ప్రసారం చేస్తాయని చెబుతున్నారు.

స్పానిష్ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ (CSIC) , డోనానా బయోలాజికల్ స్టేషన్‌లోని పరిశోధకుడు జోర్డి ఫిగ్యురోలా ఈ సంవత్సరం ఈ వైరస్ వ్యాప్తికి శీతాకాలం, వసంతకాలం కారణమని పేర్కొన్నారు. అంతేకాదు ఈ వైరస్ వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందని ఫిగ్యురోలా హెచ్చరించారు.

పశ్చిమ స్పానిష్ ప్రాంతం ఎక్స్‌ట్రీమదురాలో 17 వెస్ట్ నైల్ వైరస్ కేసులు నమోదయ్యాయి. సుమారు 20% కేసులు తలనొప్పి, అధిక జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి తీవ్రమైన లక్షణాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

అరుదైన సందర్భాల్లో ఈ వెస్ట్ నైల్ వైరస్ ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా వృద్ధులలో.. 5% కంటే తక్కువ కేసులను ప్రభావితం చేస్తుంది. వ్యాప్తిని ఎదుర్కోవడానికి, నిపుణులు త్రిముఖ విధానాన్ని సూచిస్తున్నారు.దోమల వృద్ధిని నిరోధించడానికి నిటి నిల్వను తొలగించడం, పర్యావరణ అనుకూల లార్విసైడ్లను ఉపయోగించడం. సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి వ్యక్తిగత రక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..